రౌడీ హీరోకు లైగర్ డిజాస్టర్ తర్వాత ఖుషి కొంత ఊరట కలిగించింది కానీ ఆశించినంత పెద్ద స్థాయిలో వర్కౌట్ కాని మాట వాస్తవం. అందుకే ఫ్యామిలీ స్టార్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరుశురాం దర్శకుడు కావడంతో అభిమానులు పాజిటివ్ సెంటిమెంట్ ఫీలవుతున్నారు. లక్కీ గర్ల్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా రష్మిక మందన్న ఒక స్పెషల్ సాంగ్ చేయడం అంచనాల పరంగా ప్రత్యేకంగా నిలుస్తోంది. దేవర వదులుకున్న ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న ది ఫ్యామిలీ స్టార్ టీజర్ తో కంటెంట్ లో ఏముందో కొన్ని క్లూస్ ఇచ్చేశారు
నిమిషం వీడియోలోనే విజయ్ దేవరకొండ పాత్ర ఎలా ఉండబోతోందనే క్లారిటీ వచ్చింది. సివిల్ ఇంజనీర్ గా పని చేసే కుర్రాడు. అతనికి ఇద్దరు అక్కయ్యలు. సౌమ్యుడిగా కనిపించినా కుటుంబం జోలికి ఎవరైనా వస్తే మాత్రం తుప్పు రేపుతాడు. ఫ్యామిలీ అంటే ఎంత ప్రాణమున్నా బడ్జెట్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్. లీటర్ పెట్రోల్ లో ఒక్క చుక్క తగ్గినా బంకు కుర్రాడి బ్యాండ్ వాయించేంత. అలాంటి ఇతని జీవితంలోకి ఒక అందమైన అమ్మాయి వస్తుంది. పరిచయమైన కొత్తలో లిఫ్టుకి కూడా డబ్బులడిగిన ఇతగాడు చివరికి ఫ్యామిలీ స్టార్ ఎలా అయ్యాడో తెలియాలంటే ఇంకో నెల ఆగాలి.
ఎక్కువ కంటెంట్ రివీల్ కాకుండా టీజర్ ని ఒక రాప్ సాంగ్, రెండు మూడు డైలాగులతో నింపేయడం కొంత అసంతృప్తి కలిగించినా ట్రైలర్ ఇంకా బాకీ ఉంది కాబట్టి అప్పటిదాకా ఎదురు చూడాలి. క్లాసు మాస్ రెండు షేడ్స్ కలిసిన క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ కొత్తగా కనిపిస్తున్నాడు. సిస్టర్ సెంటిమెంట్, విలన్లతో మాస్ ఫైట్లు, అమ్మ ఎమోషన్, కాలేజీ అమ్మాయితో ప్రేమ, పెళ్ళయాక పిల్లల బాధ్యత ఇలా టోటల్ గా ఫ్యామిలీ ప్యాకేజీని నింపాడు దర్శకుడు పరశురామ్ . గోపిసుందర్ సంగీతం చక్కగా దోహదపడింది . చూస్తుంటే విజయ్ దేవరకొండకి మరో క్లీన్ ఎంటర్ టైనర్ పడ్డట్టే.
This post was last modified on March 4, 2024 9:35 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…