పెద్ద మాస్ హీరో కావడానికి సరిపోయే కటౌట్ ఉన్నప్పటికీ.. ముకుంద అనే వైవిధ్యమైన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. అక్కడ్నుంచి అతడి ప్రయాణం భిన్నంగానే సాగుతోంది. హీరోయిన్ డామినేషన్ ఉన్న ‘ఫిదా’.. పక్కా ప్రేమకథ అయిన ‘తొలిప్రేమ’ చేసి మెప్పించిన వరుణ్.. ఘనవిజయాలు అందుకున్నాడు.
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి చేసిన కామెడీ సినిమా ‘ఎఫ్-2’ కూడా అతడికి మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఈ విజయాల పునాది మీద పెద్ద రేంజికి వెళ్తాడనుకుంటే.. సరైన సినిమాలు ఎంచుకోకపోవడంతో కెరీర్ తిరోగమనంలో పయనిస్తోంది. రెండేళ్ల వ్యవధిలో వరుణ్ కెరీర్ ఊహించని పతనం చవిచూసింది. తన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అంతా కరిగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
‘గని’ సినిమా వరుణ్ కెరీర్‌కు పెద్ద బ్రేకే వేసింది. అలాంటి సినిమా వరుణ్ అసలెందుకు చేశాడో అర్థం కాని పరిస్థితి. ఇంతలో క్రేజీ సీక్వెల్ ‘ఎఫ్-3’ కూడా తేడా కొట్టేసింది. తక్కువ వ్యవధిలో రెండు ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు వరుణ్. ఇక గత ఏడాది మంచి అంచనాల మధ్య వచ్చిన ‘గాండీవధారి అర్జున’ కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. వరుణ్ మార్కెట్ ఎంతగా దెబ్బతిందో ఈ సినిమాతో రుజువైంది. దాదాపుగా పెట్టుబడి మొత్తం వేస్ట్ అయిపోయింది. వీకెండ్లోనే సినిమా చతికిలపడింది.
ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్’ అయితే మరీ ఘోరమైన ఫలితాన్ని అందుకుంది. వరుణ్ ఎంతో కష్టపడి నెల రోజులకు పైగా ప్రమోషన్లు చేసినా.. ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. ఈ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ రాలేదు. తొలి రోజే థియేటర్లు ఖాళీగా కనిపించాయి. టాక్ కూడా అంతంతమాత్రంగా ఉండడంతో సినిమాకు ఆక్యుపెన్సీలు పెరగలేదు. వీకెండ్లోనే పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సినిమా.. సోమవారం నుంచి అస్సలు నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. వరుస ఫెయిల్యూర్లు వరుణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను బాగానే దెబ్బ తీశాయని స్పష్టమవుతోంది. వైవిధ్యమైన పాత్రలు, కథలు చేయడం ఓకే కానీ.. బాక్సాఫీస్ దగ్గర ఏది వర్కవుట్ అవుతుందో వరుణ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది.
This post was last modified on March 4, 2024 4:28 pm
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…