మన బాక్సాఫీస్ సరైన సినిమా రాక డల్లుగా ఉంది కానీ మలయాళంలో తక్కువ గ్యాప్ లో వచ్చిన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ రెండూ బ్లాక్ బస్టర్ కొట్టి సంచలన వసూళ్లు సాధిస్తున్నాయి. వీటిలో మొదటిది తెలుగులో వచ్చే వారం విడుదల కానుండగా మరొకటి మార్చి 15 తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతోంది. ఎంత పెద్ద హిట్ అయినా రీమేక్ చేస్తే ఒరిజినల్ ఫీల్ ని పునఃసృష్టించలేమని గుర్తించిన నిర్మాతలు ఆ ఆలోచన మానుకుని డబ్బింగ్ ఫిక్సయ్యారు. మంజుమ్మెల్ బాయ్స్ ని ఏకంగా కమల్ హాసన్, విక్రమ్ లాంటి అగ్ర హీరోలు టీమ్ ని ఇంటికి పిలిచి మరీ మెచ్చుకున్నారు. అంతగా ఇందులో ఏముంటుందంటే.
సింపుల్ గా చెప్పాలంటే ఇదో సర్వైవల్ థ్రిల్లర్. మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన 11 స్నేహితుల గ్యాంగ్ సరదా విహారానికి కోడై కెనాల్ వెళ్తారు. ముందు గోవా అనుకుంటారు కానీ బడ్జెట్ సమస్య వల్ల ప్లేస్ మార్చుకుంటారు. పాత గుణ సినిమాలో ప్రియతమా నీవచట కుశలలా పాట షూట్ చేసిన గుహల్లోకి వెళ్తారు. అనుకోకుండా వాళ్ళలో ఒకడు గోతిలో పడతాడు. అతన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒకదశలో పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ కుర్రాడు ఎలా బయటికొచ్చాడనేది స్క్రీన్ మీద చూస్తేనే కిక్కు.
ఫ్రెండ్స్ మధ్య సరదా సన్నివేశాలతో, హాయిగా అనిపించే ఎమోషన్స్ తో మంజుమ్మెల్ బాయ్స్ ఆద్యంతం విసుగు రాకుండా చేస్తుంది. చివరి ఇరవై నిముషాలు ఏం జరుగుతుందనే ఉత్సుకతని రేపడంలో దర్శకుడు చిదంబరం ఎస్ పొడువల్ అద్భుత ప్రతిభ చూపించాడు. గుణ సాంగ్ ని వాడుకున్న తీరుకి హాట్స్ అఫ్ అనకుండా ఉండలేం. టెక్నికల్ గా ప్రతి విభాగం తక్కువ బడ్జెట్ లో గొప్ప అవుట్ ఫుట్ ఇచ్చింది. కేరళకు పోటీగా తమిళనాడులోనూ మంజుమ్మెల్ బాయ్స్ సెన్సేషన్ సృష్టిస్తోంది. మరి తెలుగులో అదే స్థాయిలో ఆడుతుందో లేదో ఇంకో రెండు వారాల్లో తేలిపోవచ్చు
This post was last modified on March 2, 2024 7:14 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…