Movie News

ప్యాన్ ఇండియా పెళ్లిలో సెలబ్రిటీల డాన్సులు

క్షణ క్షణం సినిమా పాటలో సిరివెన్నెల రాసిన ఒక చరణం ఉంటుంది. కో అంటే కోటి, దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోతి అంటూ డబ్బుంటే ఏదైనా చేయొచ్చనే అర్థంలో శాస్త్రి గారి సాహిత్యం కాలంతో సంబంధం లేకుండా ఇప్పటికీ కనెక్టవుతూనే ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావనకు ఒక ప్యాన్ ఇండియా పెళ్లి కారణం. అదేంటి మూవీస్ కి వాడే ఈ పదం హఠాత్తుగా మ్యారేజ్ కు ఎందుకనే పాయింట్ కి వద్దాం. భారతదేశపు బిజినెస్ దిగ్గజం ముఖేష్ అంబానీ గారాల వారసుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫోటోలు వీడియోలకే మైండ్ పోతోంది.

స్టార్ హీరోలు గ్రూప్ డాన్సర్లుగా మారుతున్నారు. బాలీవుడ్ ని శాశించే స్థాయిలో ఉన్న షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటోళ్ళు స్టేజి మీద ఆడుతూ పాడుతూ ఉంటే చూసేవాళ్లకు రెండు కళ్ళు చాలడం లేదు. ఖరీదయిన ఒక లగ్జరి బస్సులో వేదిక దగ్గరకు వెళ్లేందుకు తారలందరూ సామాన్యుల్లా సీట్ల కోసం వెతుకుంటున్న వీడియోలు చూసి జనాలు ఔరా అనుకుంటున్నారు. అసలు కలలో కూడా చూస్తామా లేదా అనే దృశ్యాలు ముఖేష్ అంబానీ పుణ్యమాని జరిగిపోతున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రిహానా ప్రోగ్రాంకే 70 కోట్లకు ఖర్చు పెట్టారనే వార్త ఆల్రెడీ వైరల్ అయ్యింది.

బోలెడు విశేషాలు వస్తూనే ఉన్నాయి. పెళ్లి ఖర్చు వెయ్యి కోట్లకు పైగానే అవుతుందని ఒక అంచనా. అంబానీ సంపదలో ఇదో వెంట్రుక ముక్కంత బడ్జెట్. సౌత్ నుంచి కూడా ఎందరో సెలబ్రిటీలకు ఆహ్వానాలు వెళ్లాయి. వందల ఎకరాల్లో జరుగుతున్న ఈ వేడుకని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు జీవితంలో మర్చిపోలేరని అంటున్నారు. ఫ్యాన్స్ దేవుడిగా కొలిచే స్టార్లు అంబానీ ఇంట్లో అతి మాములు మనుషుల్లా కనిపించడం చూసి షాక్ తినని వారు లేరు. నిజంగా అంబానీ కనక సినిమా ప్రొడక్షన్ ని సీరియస్ గా తీసుకుంటే హాలీవుడ్ ని తలదన్నే ప్యాన్ వరల్డ్ మూవీని తీయడం ఎంత సేపు. జరగాలనే కోరుకుందాం.

This post was last modified on March 2, 2024 5:44 pm

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

17 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago