నటిగా కంటే దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసిగా అంకితా లోఖండె ఎక్కువగా పాపులర్ అయింది. మీడియాలో తన పేరు ఈ కోణంలోనే ఎక్కువగా నానింది. సుశాంత్ టీవీ నటుడిగా ఉన్నపుడు తన సహ నటి అయిన అంకితతో కొన్నేళ్లు ప్రేమలో ఉన్నాడు. ఐతే తర్వాత అతను సినిమాల్లోకి వచ్చి స్టార్ అయ్యాడు. ఈ లోపు వాళ్లిద్దరి బంధం బీటలు వారింది. సుశాంత్ నుంచి విడిపోయిన కొన్నేళ్లకు అంకిత.. విక్కీ జైన్ అనే మరో వ్యక్తిని పెళ్లాడిన సంగతి తెలిసిందే.
ఆ విషయం పక్కన పెడితే.. తాజాగా సౌత్ సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ గురించి అంకిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక సౌత్ మూవీలో అవకాశం వచ్చిందని తాను అప్పట్లో చాలా సంతోషించానని.. కానీ నిర్మాతతో పడుకుంటేనే ఆ ఛాన్స్ అని చెప్పడంతో షాకయ్యానని గుర్తు చేసుకుంది అంకిత.
“చాలా ఏళ్ల కిందట నేను ఒక దక్షిణాది చిత్రం ఆడిషన్స్‌కు హాజరయ్యాను. ఆ తర్వాత నాకు ఆ టీం నుంచి కాల్ వచ్చింది. ఆ సినిమాకు నన్ను ఓకే చేయడంతో మా అమ్మతో ఆ ఆనందాన్ని పంచుకున్నాను. కానీ నన్ను అంత సింపుల్‌గా సినిమాకు ఎంపిక చేయడం కొంత ఆశ్చర్యం కలిగించింది. కాంట్రాక్టు మీద సంతకం చేసేందుకు నన్ను పిలిచారు. అప్పుడు నాతో పాటు వచ్చిన మేనేజర్‌ను బయటే ఉండమని చెప్పి నన్ను లోపలికి రమ్మన్నారు. లోపలికి వెళ్లాక నేను కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుందని చెప్పారు. ఎలాంటి కాంప్రమైజ్ అని అడిగితే.. నిర్మాతతో ఒక రాత్రి గడిపితేనే నాకు ఆ అవకాశం దక్కుతుందని చెప్పారు. అప్పుడు అర్థమైంది.. ఆ నిర్మాతకు నా టాలెంట్‌తో సంబంధం లేదని. నాతో ఇలాంటివి కుదరవని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేశాను” అని అంకిత వెల్లడించింది.
This post was last modified on March 2, 2024 5:37 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…