గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఒక ప్రాపగండా సినిమా తీసి.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి మీద బురదజల్లే ప్రయత్నం చేశాడు సీనియర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆ చిత్రం వైసీపీకి నిజంగా కలిసి వచ్చిందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఐతే వైసీపీ మాత్రం ఆ నమ్మకంతోనే ఈసారి ఆయనకు మరింత ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇచ్చి ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలు తీయించిందన్న విషయం బహిరంగ రహస్యమే.
ఐతే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను మరింతగా టార్గెట్ చేస్తూ వర్మ తీసిన ఈ సినిమాలకు కోర్టు కేసుల రూపంలో అడ్డంకులు ఎదురవడం.. వాయిదాల మీద వాయిదాలు పడడం తెలిసిందే. ఈ అడ్డంకులు తొలగిపోయాక కూడా ఫిబ్రవరి 23కు వ్యూహంను షెడ్యూల్ చేసి, చివరి నిమిషంలో వాయిదా వేశాడు వర్మ.
ఇక వర్మ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా లేదా అనుకుంటుండగా.. మార్చి 2కు ‘వ్యూహం’ కోసం కొత్త డేట్ ఇచ్చిన వర్మ.. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగలిగాడు. ఈ వీకెండ్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’; ‘చారి 111’, ‘భూతద్దం భాస్కర నారాయణ’ చిత్రాలు ఆల్రెడీ విడుదల కాగా.. తర్వాతి రోజు చడీ చప్పుడు లేకుండా థియేటర్లలోకి దిగింది ‘వ్యూహం’.
ఐతే వర్మ అంచనా వేసినట్లు టీడీపీ, జనసేన వాళ్లు ఈ సినిమా కోసం ఎగబడడం లాంటిదేమీ జరగలేదు. వాళ్లు అసలు ఈ సినిమాను పట్టించుకోనే లేదు. పోనీ వైసీపీ వాళ్లయినా ఓన్ చేసుకున్నారా అంటే అదీ జరగలేదు. ఈ సినిమా గురించి అసలు ఎక్కడా డిస్కషనే లేదు. ‘వ్యూహం’ రిలీజైన సంగతి కూడా సామాన్య జనాలకు తెలియని పరిస్థితి. రిలీజైన చోటల్లా థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సినిమా చూసిన వాళ్లు కూడా మరీ నాసిరకంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on March 2, 2024 4:37 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…