Movie News

నన్నా దర్శకుడు కొట్టలేదు

సినిమాల చిత్రీకరణలో దర్శకులు, నిర్మాతలు అసహనానికి గురై ఆర్టిస్టుల మీద అరవడం.. కొన్నిసార్లు చేయి కూడా చేసుకోవడం గురించి గతంలో చాలా కథలు వినేవాళ్లం. కానీ తర్వాత రోజులు మారాయి. ఆర్టిస్టుల మీద అరిచినా అదో పెద్ద న్యూస్ అయిపోతోంది. మీడియాలో నానా రభస జరిగిపోతోంది. అందుకే ఇలాంటి వార్తలు గత కొన్నేళ్లలో బాగా తగ్గిపోయాయి. మంచి పెర్ఫామెన్స్ రాబట్టుకునే క్రమంలో తేడా వస్తే ఆర్టిస్టులను కొట్టేస్తాడని పేరున్న తేజ సైతం అలాంటి వాటికి దూరంగా ఉంటున్నట్లే కనిపిస్తున్నాడు.

ఇలాంటి టైంలో తమిళ సీనియర్ దర్శకుడు బాల.. ఓ హీరోయిన్ని కొట్టినట్లు ఈ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి. అరుణ్ విజయ్ హీరోగా బాల తెరకెక్కిస్తున్న ‘వంగమన్’ సినిమాకు ముందు మలయాళ అమ్మాయి మామిత బైజు హీరోయిన్‌గా ఎంపికైంది.

కానీ ఆమె మధ్యలో ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇందుక్కారణం బాల ఆమెపై చేయిచేసుకోవడమే అని ఆ మధ్య మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఐతే ఈ వార్తలను ఇప్పుడు మామిత ఖండించింది. బ్లాక్‌బస్టర్ మూవీ ‘ప్రేమలు’తో మంచి పాపులారిటీ సంపాదించిన మామితను తాజాగా ఓ మీడియా సంస్థ బాలతో గొడవ గురించి అడిగింది.

దీనికామె బదులిస్తూ.. ‘‘మీడియాలో నా గురించి వస్తను్న వార్తలు నిజం కాదు. దర్శకుడు బాల గురించి నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. వనంగాన్ సినిమా కోసం నేను దాదాపు ఏడాది పాటు పని చేశాను. ప్రి ప్రొడక్షన్ పనుల్లో భాగమయ్యాను. కానీ ఆ సినిమా ఆలస్యం అవుతుండటంతో వేరే కమిట్మెంట్ల వల్ల దూరం కావాల్సి వచ్చింది. అంతకుమించి ఏమీ జరగలేదు. బాల గారు సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయన వల్ల నేను ఏ రకంగానూ ఇబ్బంది పడలేదు. ఆయన నన్ను కొట్టారన్నది అవాస్తవం’’ అని మామిత స్పష్టం చేసింది.

This post was last modified on March 2, 2024 6:46 am

Share

Recent Posts

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

8 minutes ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

37 minutes ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

1 hour ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

2 hours ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

2 hours ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

2 hours ago