మాములుగా ఓటిటిలో డైరెక్ట్ రిలీజ్ జరుపుకుని వర్కౌట్ అయిన సినిమాకు కొనసాగింపు థియేటర్ కోసం చేయడం అరుదు. కానీ గత ఏడాది మా ఊరి పొలిమేర దర్శక నిర్మాతలు ఈ ట్రెండ్ ని బ్రేక్ చేసి విజయవంతంగా సూపర్ హిట్ అందుకున్నారు. సీక్వెల్ కు పెట్టిన బడ్జెట్ కి మూడింతలు వసూలు చేసి ఇప్పుడు థర్డ్ పార్ట్ కోసం రెడీ అవుతోంది. ఈసారి ఖర్చు మరింత పెంచబోతున్నారు. ఇప్పుడీ విజయమే ఓదెల రైల్వే స్టేషన్ మేకర్స్ ని పురికొల్పింది. ఇవాళ లాంఛనంగా ప్రారంభమైన ఓదెల 2ని కాశిని గ్రాండ్ గా మొదలుపెట్టారు. కీలకమైన షెడ్యూల్ అక్కడే చేయబోతున్నారు.
హెబ్బా పటేల్ మొదటి భాగంలో కీలక పాత్ర పోషించింది. అయితే అదిరిపోయే బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు కానీ డీసెంట్ గానే ఆడియన్స్ కి రీచ్ అయ్యింది. వయొలెన్స్, బోల్డ్ కంటెంట్ మీద కొన్ని నెగటివ్ కామెంట్స్ లేకపోలేదు. నిర్మాత సంపత్ నంది ఈసారి తగినన్ని జాగ్రత్తలు తీసుకుని ఏకంగా మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకొచ్చి గ్లామర్ ఫ్యాక్టర్ పెంచాడు. ఇతని డైరెక్షన్ లో గతంలో తమన్నా రచ్చ, సీటీ మార్ చేసింది. ఆ బాండింగే ఇప్పుడీ ప్రాజెక్టు ఒప్పుకోవడానికి కారణం కావొచ్చు. తమన్నా బోల్డ్ సీన్స్ కి అభ్యంతరం చెప్పడం లేదని హిందీ వెబ్ సిరీస్ లో ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది.
చూస్తుంటే మెల్లగా ఓటిటి కంటెంట్ లు బిగ్ స్క్రీన్ కోసం తయారవుతున్నాయని అర్థమవుతోంది. హాట్ స్టార్, ఆహా లాంటి ఫ్లాట్ ఫార్మ్స్ ఈ విషయంలో ఎలాంటి నిబంధనలు పెట్టకపోవడంతో నిర్మాతల పని సుళువవుతోంది. అదే వరల్డ్ వైడ్ రీచ్ ఉన్న ఓటిటిల్లో ఇలా చేయలేము. అగ్రిమెంట్ లో ముందుగానే తమతో చేసిన టైటిల్, సబ్జెక్టులతో అనుమతి లేకుండా కొనసాగింపులు చేయకూడదని కండీషన్లు పెడతారు. హాట్ స్టార్ మినహాయింపుగా నిలుస్తోంది. ఓదెల 2 బడ్జెట్ దాదాపు నాలుగైదింతలు పెంచారట. కాంతార, విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నాడు.
This post was last modified on March 1, 2024 8:01 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…