హీరో గోపీచంద్ అభిమానులు హిట్టు కోసం మొహం వాచిపోయిన తరుణంలో వస్తున్న సినిమా భీమా. మార్చి 8 శివరాత్రి పండగ సందర్భంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ట్రైలర్ ని బట్టి కాన్సెప్ట్ ఏదో డిఫరెంట్ గా ట్రై చేసిన ఫీలింగ్ ఇచ్చారు. పోలీస్ ఆఫీసర్ గా, పల్లె జనంలో ఒకడిగా రెండు షేడ్స్ కనిపిస్తున్నాయి. డ్యూయల్ రోలా లేక ఇంకేదయినా ట్విస్టు పెట్టారా అనేది వేచి చూడాలి. వరస డిజాస్టర్ల దెబ్బకు గోపిచంద్ మార్కెట్ దెబ్బ తిన్న మాట వాస్తవం. అలా అని అతని సినిమాలు అసలు ఎవరూ చూడటం లేదని కాదు అర్థం. ఓపెనింగ్స్ ఇప్పటికీ వస్తున్నాయి. అసలు మ్యాటర్ వేరే ఉంది.
భీమా దర్శకుడు ఏ హర్ష కన్నడం నుంచి వచ్చాడు. మనకు అంత అవగాహన లేదు కానీ శాండల్ వుడ్ లో ఇతని ట్రాక్ రికార్డు పెద్దదే. శివరాజ్ కుమార్ ఏకంగా నాలుగు సినిమాలు చేస్తే వాటిలో రెండు అతి పెద్ద బ్లాక్ బస్టర్స్. ముఖ్యంగా భజరంగి ఓ రేంజ్ లో ఆడింది. పునీత్ రాజ్ కుమార్ తో అంజనీ పుత్రతో మంచి సక్సెస్ అందుకున్నాడు. డివోషనల్ బ్యాక్ డ్రాప్ పెడుతూనే కమర్షియల్ టచ్ ఇవ్వడంలో ఇతను సిద్ధహస్తుడు. అందుకే ట్రైలర్ చూసాక ఎలాంటి అభిప్రాయం కలిగినా స్క్రీన్ మీద ఫైనల్ అవుట్ ఫుట్ మాత్రం మంచిదే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. మరి భలే ఛాన్స్ ఏమనుకుంటున్నారా.
సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఫుల్ జోష్ తీసుకొచ్చిన మాస్ సినిమా ఏదీ లేదు. అన్ని చిన్న బడ్జెట్ సినిమాలు వేసుకుని సగం కూడా నిండని థియేటర్లతో నెట్టుకుంటూ వచ్చారు. మధ్యలో ఈగల్ లాంటివి వచ్చినా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. ఆపరేషన్ వాలెంటైన్ సైతం మాస్ కోసం తీసింది కాదు. ఈ నేపథ్యంలో భీమా కనక జనాలకు కనెక్ట్ అయితే లక్కే. 14 నుంచి 20 కోట్ల లోపే తెలుగు థియేట్రికల్ బిజినెస్ చేశారనే టాక్ ఉంది. నిజమైతే మాత్రం హిట్టు టాక్ తో తొందరగానే లాభాలు పట్టొచ్చు. విశ్వక్ సేన్ గామి పోటీ ఉన్నా దాని జానర్ వేరు కాబట్టి టెన్షన్ లేదు.
This post was last modified on March 1, 2024 5:42 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…