స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్… వీళ్లకు తోడు ఇంకొందరు స్టార్లు కలిశారంటే చాలు బడ్జెట్ ఈజీగా వంద కోట్లు దాటేస్తుంటుంది. పాట తీయాలంటే కోట్లు.. ఫైట్ తీయాలంటే కోట్లు.. కొన్ని నిమిషాల సన్నివేశాలకు కూడా కోట్లే. తీరా సినిమా చూస్తే ఈ అనవసర హంగులు, ఆర్భాటాలు తప్ప కంటెంట్ ఉండదు. అదే రొడ్డకొట్టుడు కథలు.. అవే అలవాటైన విజువల్స్. ఇలాంటి పెద్ద సినిమాల్లో ఒక పాటకో, ఫైట్‌కో పెట్టే బడ్జెట్ ఇస్తే అదిరిపోయే సినిమా తీస్తామని ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శకులు నిర్మాతల వెంట పడుతుంటారు. కానీ వాళ్లను పట్టించుకోరు. కావాల్సిందల్లా క్రేజీ కాంబినేషనే.
ఐతే ఓ చిన్న సినిమా బృందం.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సమకూర్చుకుని.. ఏకంగా ఆరేళ్ల పాటు ఎంతో శ్రమకు ఓర్చి, ఒక తపనతో తీసిన సినిమా ‘గామి’కి వచ్చిన ఔట్ పుట్ చూసి ఇప్పుడు ఇండస్ట్రీ జనాలు నివ్వెరపోతున్నారు. క్రౌడ్ ఫండింగ్‌తో తీసిన సినిమాలో ఇలాంటి విజువల్సా.. ఇంత కొత్తదనమా.. అని షాకై చూస్తున్నారు ‘గామి’ ట్రైలర్‌ను. విషయం లేని సినిమాలకు వందల కోట్లు పోసే నిర్మాతలు ఈ చిన్న సినిమాకు వచ్చిన ఔట్ పుట్ చూసి ముక్కున వేలేసుకుంటారనడంలో సందేహం లేదు.
ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్లు, చిన్న చిన్న ప్రోమోలు, మేకింగ్ వీడియోలతోనే ‘గామి’ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ట్రైలర్ చూసిన వాళ్లకు మతులు పోతున్నాయి. ఒక ఎపిక్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగించింది ఈ ట్రైలర్. ప్రతి ఫ్రేమ్‌లోనూ ‘గామి’ టీం తపన అంతా కనిపించింది. కొంచెం ప్రోత్సాహం అందిస్తే యంగ్ టీమ్స్ ఎలాంటి అద్భుతాలు చేయగలవో ‘గామి’ ట్రైలర్ రుజువు చేసింది.
ఇలాంటి గొప్ప ప్రయత్నానికి కొంచెం ఆలస్యంగా అయినా యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్ అండగా నిలవడం గొప్ప విషయం. ట్రైలర్‌తో పెంచిన అంచనాలను సినిమా అందుకుని.. ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచినట్లయితే.. టాలీవుడ్‌కు ఇదొక పెద్ద పాఠంలా మారడం ఖాయం.
This post was last modified on March 1, 2024 12:30 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…