క్యారెక్టర్ రోల్స్‌తో మొదలుపెట్టి హీరోగా ఒక స్థాయి అందుకున్న యువ కథానాయకుడు శ్రీ విష్ణు. హీరోగా అతను ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలతో ప్రయాణం సాగిస్తుంటాడు. గత ఏడాది సామజవరగమనతో మంచి హిట్ కొట్టిన శ్రీ విష్ణు.. మార్చి 22న ఓం భీం భుష్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టీజర్ చూస్తే చాలా ప్రామిసింగ్‌గా అనిపించింది. శ్రీ విష్ణు ఖాతాలో ఇంకో హిట్ పడేలా కనిపిస్తోంది. గురువారం శ్రీ విష్ణు పుట్టినరోజు కాగా.. ఆ సందర్భంగా అతడి రెండు కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్ ఉంటుందని సమాచారం.
అందులో ఒకటి గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో చేయబోతున్న సినిమా. కార్తీక్ రాజు అనే కొత్త దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించబోతున్నాడు. గీతా ఆర్ట్స్-2లో మిడ్ రేంజ్, యంగ్ హీరోలతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు బన్నీ వాసు. ఇప్పుడిప్పుడే పెద్ద బేనర్లలోకి వస్తున్న శ్రీ విష్ణు.. ఓం భీం బుష్ కోసం యువి ్రియేషన్స్‌తో జట్టు కట్టాడు. ఇప్పుడతను గీతా ఆర్ట్స్‌లో అడుగు పెడుతున్నాడు.
శ్రీ విష్ణు పుట్టిన రోజుకు ఇంకో సినిమా ప్రకటన కూడా ఉంటుంది. అదే రాజరాజచోర దర్శకుడు హాసిత్ గోలితో చేస్తున్న సినిమా. ఇది రాజ రాజ చోరకు సీక్వెలా వేరే కథతో తెరకెక్కుతున్న సినిమానా అన్నది క్లారిటీ లేదు. ఐతే ఈ సినిమాకు స్వాగ్ అనే టైటిల్ పెడుతున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా ఆ టైటిల్‌తోనే సినిమాను ప్రకటించబోతున్నారట. త్త ఏడాదిలో శ్రీ విష్ణు నుంచి మంచి లైనప్పే చూడబోతున్నామన్నమాట.
This post was last modified on February 28, 2024 10:12 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…