Movie News

రియా కుటుంబం అంత పనీ చేసేలా ఉంది

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది అతడి మాజీ ప్రేయసి రియా చక్రవర్తి. ఆమె వల్లే అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని, అతడి డబ్బుల్ని ఆమె వాడుకుందని ముందు ఆరోపణలు వచ్చాయి. ఇందులో కుట్ర కోణం గురించి కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే ఈ విషయాలపై పోలీసులు విచారణ జరిపితే సరైన ఆధారాలేమీ దొరికినట్లు లేవు.

ఐతే ఈ కేసును విచారించే క్రమంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. సుశాంత్, రియా కలిసి డ్రగ్స్ తీసుకునేవాళ్లని వెల్లడైంది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. రియాను కొన్ని రోజుల పాటు విచారించడమే కాక.. ఆమెను అరెస్టు కూడా చేసింది. ఈ కేసులో ఆమెకు బెయిల్ కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో కేసు కొత్త మలుపు తిరిగింది.

ఇన్నాళ్లూ సుశాంత్ విషయంలో సౌమ్యంగానే మాట్లాడుతూ వచ్చారు రియా, ఆమె కుటుంబ సభ్యులు. కానీ డ్రగ్స్ కేసు రియా మెడకు చుట్టుకోవడంతో వాళ్ల ఆలోచన మారినట్లు స్పష్టమవుతోంది. చనిపోయిన వ్యక్తి అని చూడకుండా అతడి గురించి ఎలా పడితే అలా మాట్లాడేస్తోంది రియా కుటుంబం. రియా కొంప మునిగే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో సుశాంత్ గురించి ముందు వెనుకా ఆలోచించేలా కనిపించట్లేదు. ఆమెను బయటపడేసేందుకు ఎంత వరకైనా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే రియా లాయర్.. సుశాంత్ ఒక డ్రగ్ అడిక్ట్ అంటూ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు రియా తండ్రి ఇంద్రజిత్ ముఖర్జీ లైన్లోకి వచ్చారు. సుశాంత్ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో అసౌకర్యాన్ని కలిగించే సత్యం దాగి ఉంది. సుశాంత్‌ ప్రాణాలతో ఉండి ఉంటే.. డ్రగ్స్‌ తీసుకున్న ప్రధాన నిందితుడిగా, వాటికి డబ్బులు ఇచ్చి కొన్న వ్యక్తిగా ఉండేవాడు. సుశాంత్‌కు న్యాయం జరగాలి అంటూ ఇంత వరకు తెచ్చారు. తన ప్రియుడి వల్ల రియా ఇటువంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది. రియా అమాయకురాలు’’ అన్నారు. దీన్ని బట్టి చూస్తే రియాను కాపాడేందుకు ఆమె కుటుంబం సుశాంత్ గురించి ఎన్ని మాటలైనా అనడానికి, ఆరోపణలైనా చేయడానికి వెనుకాడేలా లేదని స్పష్టమవుతోంది.

This post was last modified on September 10, 2020 1:22 pm

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

1 hour ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

2 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

3 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

7 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

7 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

9 hours ago