మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కన్నప్పలో ఎంత పెద్ద స్టార్ అట్రాక్షన్ ఉందో చూస్తున్నాం. ప్రభాస్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఇప్పటికే కన్ఫర్మ్ లిస్టులో ఉండగా తాజాగా ఈ జాబితాలో బాలకృష్ణ చేరొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. కథలో ఒక కీలక పాత్ర కోసం ఆయనైతే బాగుంటారని టీమ్ అభిప్రాయం వ్యక్తం చేయడంతో విష్ణుతో పాటు మోహన్ బాబు వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేయొచ్చని తెలిసింది. అయితే కథ విన్నాకే నిర్ణయం తీసుకోమని ఒకవేళ నో చెప్పినా తామేమీ ఫీల్ కామని ముందుగానే చెబుతారట. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి.
బాలయ్య అతిథి లేదా ప్రత్యేక పాత్రలు చేయడం చాలా అరుదు. ఒకప్పుడు తండ్రి ఎన్టీఆర్ కోసం మాత్రమే స్పెషల్ రోల్స్ చేశారు. చాలా కాలం తర్వాత మంచు మనోజ్ ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో నటించారు. అది కూడా స్టోరీ విపరీతంగా నచ్చి. సినిమా ఆడలేదు కానీ ఆ మాత్రం ఆడియన్స్ దాన్ని థియేటర్లలో చూశారంటే కేవలం బాలకృష్ణ బ్రాండ్ వల్లే. అయితే అది హారర్ టచ్ ఉన్న కామెడీ థ్రిల్లర్. కన్నప్ప కేసు వేరే. పూర్తి ఆధ్యాత్మికతతో వీర శివ భక్తుడి గాథను సరికొత్త టెక్నాలజీతో చెప్పబోతున్నారు. ఇన్ సైడ్ టాక్ అయితే రావణబ్రహ్మ కోసం బాలయ్యని సంప్రదిస్తారని అంటున్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న కన్నప్ప ఇప్పటికే కీలకమైన షెడ్యూల్ ని విదేశాల్లో పూర్తి చేసుకుంది. ప్రభాస్ ఫస్ట్ లుక్ ని శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయాలనే ప్లానింగ్ ఉంది కానీ ఎంతమేరకు సాధ్యమవుతుందో చెప్పలేం. అసలు ఇంకా క్యాస్టింగ్ కు సంబంధించిన ఏ డీటెయిల్ ని కన్నప్ప టీమ్ అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ మహాపర్వదినం కాబట్టి కనీసం ఒక అప్డేట్ అయినా ఇవ్వాలని మంచు విష్ణు ఆలోచన. బాబీ దర్శకత్వంలో సినిమా, రాబోయే ఏపీ ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్న బాలయ్య విష్ణు ఫ్యామిలీ అడిగితే కాదనకపోవచ్చేమో కానీ డేట్లు ఏ మేరకు కుదురుతాయో.
This post was last modified on February 27, 2024 12:25 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…