మాములుగా అయితే భారతీయుడు 2ని రామ్ చరణ్ అభిమానులు అంత సీరియస్ గా తీసుకునేవాళ్లు కాదు కానీ తమ హీరో గేమ్ ఛేంజర్ కి, దానికి ఒకే దర్శకుడు కావడంతో రిలీజ్ డేట్ కోసమైనా ఫాలో కాక తప్పడం లేదు. శంకర్ ఇప్పటిదాకా ముందు ఏది విడుదల చేయాలనే దాని మీద స్పష్టత ఇవ్వలేదు. నిర్మాణ సంస్థలు దాని కోసమే ఎదురు చూస్తున్నాయి. ఇంకోవైపు గుట్టుచప్పుడు కాకుండా ఇండియన్ 2 ప్రమోషన్లు తమిళనాడులో భారీ ఎత్తున మొదలుపెట్టారు. నిలువెత్తు బిల్డింగులు మీద కమల్ హాసన్ పెయింటింగులు, హోర్డింగులు ఆఘమేఘాల మీద ఏర్పాటు చేస్తున్నారు.
అంటే ఆల్రెడీ ప్రచారం జరుగుతున్నట్టు భారతీయుడు 2 మేలో వస్తుందనే కామెంట్లకు బలం చేకూరినట్టే. అయితే కల్కి 2898 ఏడిలోనూ కమల్ హాసన్ ఉన్నారు కాబట్టి తక్కువ గ్యాప్ లో రెండు రిలీజులు ఉండటం అసాధ్యం. కనీసం పదిహేను రోజుల నిడివి ఉండాలి. ఆ దిశగానే లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 2ని మే మూడు లేదా నాలుగో వారంలో దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోందని చెన్నై వర్గాల కథనం. మూడో భాగం కూడా ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ప్రమోషన్లు మొదలుపెట్టేసి అభిమానులను విడుదలకు సిద్ధం చేస్తే హైప్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనే ప్లానింగ్ జరుగుతోంది.
ఆడియో రిలీజ్ ఈవెంట్ ని ఏప్రిల్ లో చేసే అవకాశముంది. కమల్ తో పాటు సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, ప్రియా భవాని శంకర్, బ్రహ్మానందం, బాబీ సింహ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉండటంతో బజ్ మాములుగా ఉండేలా లేదు. పైగా మొదటిసారి శంకర్ తో కలిసి అనిరుద్ రవిచందర్ పని చేస్తున్నాడు. ఇక అంచనాలు ఎలా ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. ఒకవేళ ఇక్కడ చెప్పినట్టు రిలీజ్ కనక మేలోనే ఉంటే గేమ్ ఛేంజర్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రావడం ఖాయం. అది కూడా పవన్ ఓజి మీద ఆధారపడి ఉంది. శంకర్ మాత్రం రెండు సినిమాల పీకల్లోతు పనుల్లో యమా బిజీగా తిరుగుతున్నారు.
This post was last modified on February 27, 2024 12:21 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…