మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఐతే ఆ సినిమా విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతుండడం.. టీం నుంచి ఏ రకమైన అప్‌డేట్స్ లేకపోవడంతో అభిమానుల్లో ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది. అదే సమయంలో చరణ్ చేయబోయే కొత్త చిత్రం వారి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి.
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయబోతుండటం ఎగ్జైట్మెంట్ పెంచే విషయాలే. చరణ్ సరసన ఈ సినిమాలో జాన్వి కపూర్ కథానాయికగా నటించనున్న విషయం కూడా ఖరారైంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి కూడా ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.
‘యానిమల్’ సినిమాలో అబ్రార్ పాత్రతో సంచలనం రేపిన బాబీ డియోల్‌ను చరణ్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకు ఎంచుకోవాలని చూస్తున్నారట. ఆయనతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. బాబీ ఆల్రెడీ బాలయ్య సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నాడు. ‘యానిమల్’ రిలీజ్ కాకముందే అతనీ కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత బాబీ డిమాండ్ బాగా పెరిగిపోయింది.
బాలీవుడ్ నుంచే కాక సౌత్ నుంచి కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. చరణ్-బుచ్చిబాబు సినిమా రేంజ్ దృష్ట్యా అందులో విలన్ పాత్ర చేయడానికి బాబీ కచ్చితంగా అంగీకరిస్తాడనే అనుకుంటున్నారు. ఉత్తరాంద్ర నేపథ్యంలో ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్ కోచ్ పాత్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం ఉత్తరాంధ్రలో ఆడిషన్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on February 26, 2024 5:37 pm
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తనను సంతృప్తి పరచడం లేదని బాహాటంగానే…