దేశంలో ఒక ప్రముఖ ఫిలిం ఇండస్ట్రీలో దశాబ్దాల నుంచి టాప్ స్టార్లలో ఒకడిగా ఉంటూ.. నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీదారు అయిన హీరో.. ఒక సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తూ.. సినిమా మొత్తంలో ఒంటి మీద ఒక చొక్కా కూడా లేకుండా, కేవలం ఒక పంచెతో కనిపించడం అన్నది ఊహకైనా అందుతుందా? కానీ మలయాళ లెజెండరీ హీరో మమ్ముట్టి తన కొత్త చిత్రం ‘భ్రమయుగం’లో ఇలాగే కనిపించాడు.
ఈ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమా తీయడం ఒకెత్తయితే.. అందులో మమ్ముట్టి విలన్ పాత్ర చేయడం విశేషం. సినిమా మొత్తం మీద ఆయన పాత్ర కనీసం ఒక చొక్కా కూడా తొడుక్కోదు. కేవలం పంచెతోనే కనిపించాడు. ఆయనకు సినిమాలో పెద్దగా డైలాగులు కూడా లేవు. దయ్యం ఆవహించిన నెగెటివ్ క్యారెక్టర్ని అంత పెద్ద స్టార్ హీరో చేయడం అన్నది అనూహ్యమైన విషయం. ఐతే ఏ పాత్ర చేసినా.. దానికి తన ఇమేజ్ పూత ఏమాత్రం అద్దకుండా పాత్ర మాత్రమే కనిపించేల ా చేయడంలోనే మమ్ముట్టి ప్రత్యేకత దాగి ఉంది.
ఈ మధ్యే ఆయన స్వలింగ సంపర్కుడి పాత్రలో నటించి సామాన్య ప్రేక్షకులనే కాదు.. అభిమానులను కూడా ఒప్పించారు, మెప్పించారు. ఇప్పుడు ‘భ్రమయుగం’లో మరో అద్భుతమైన పాత్ర చేశారు. ఈ సినిమాలో కేవలం తన నవ్వుతోనే మమ్ముట్టి ప్రేక్షకులను భయపెట్టిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పాత్ర విషయంలో అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్న సమయంలోనే మమ్ముట్టి కొత్త చిత్రం ‘టర్బో’ ఫస్ట్ లుక్ రిలీజైంది. మోహన్ లాల్ ఇండస్ట్రీ హిట్ ‘పులి మురుగన్’ డైరెక్టర్ వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. దీని ఫస్ట్ లుక్‌లో జైల్లో మిగతా రౌడీలతో కలిసి కూర్చున్న రౌడీ పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచాడు మమ్ముట్టి. ఒక పాత్ర గురించి ఆశ్చర్యపోయే లోపే ఇంకో షాకింగ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులకు మరింత షాక్ ఇవ్వడం మమ్ముట్టికే చెల్లింది. అంత పెద్ద స్టార్ అయి ఉండి ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోకుండా లేటు వయసులో అద్భుతమైన పాత్రలతో అలరిస్తున్న మమ్ముట్టి నుంచి స్టార్లందరూ నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
This post was last modified on February 25, 2024 4:53 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…