Movie News

అవంతిక.. తెలుగు కబుర్లు

అవంతిక వందనపు.. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన తెలుగమ్మాయి. బాల నటిగా బ్రహ్మోత్సవం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో మెరిసిన ఈ తెలుగమ్మాయి.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మూవీస్‌లో లీడ్ రోల్స్ చేస్తోంది. ‘స్పిన్’; ‘మీన్ గర్ల్స్’ సినిమాలతో ఆమె హాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. క్యూట్‌గా కనిపించే చిన్నపాపలా తెలుగు ప్రేక్షకులకు గుర్తున్న అవంతిక.. ‘మీన్ గర్ల్స్’ కోసం చేసిన హాట్ డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసేసింది. ఈ సినిమా ప్రమోషన్లలో అవంతిక లుక్స్, తన అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్ చూసి మన వాళ్లు దిమ్మదిరిగింది.

ఐతే రోమ్‌లో ఉన్నపుడు రోమన్‌లా ఉండాలన్న సామెతను గుర్తు చేస్తూ పక్కా హాలీవుడ్ హీరోయిన్ లాగా దర్శనమిస్తున్న అవంతికలో తెలుగు మూలాలేమీ పోలేదు. ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన తెలుగు ముచ్చట్లేంటో చూద్దాం పదండి.

“నేను అమెరికాలో ఉన్నా తెలుగునేమీ మరిచిపోలేదు. మా అమ్మా నాన్నలది తెలంగాణ. నాకు ఎంతో ఇష్టమైన సిటీ హైదరాబాద్. ఇక్కడి ఫుడ్, సుల్తాన్ బజార్లో దొరికే గాజులంటే నాకు చాలా ఇష్టం. నేను పక్కా తెలంగాణ యాస మాట్లాడగలను. తెలుగుతో పాటు హిందీ కూడా బాగా మాట్లాడతా. నేను యుఎస్‌లో చిన్నప్పటి నుంచి మన సంప్రదాయ వేషధారణలోనే స్కూల్‌కి వెళ్లేదాన్ని. కొందరు నా ఆహార్యం, అలవాట్లను చూసి హేళన చేసేవాళ్లు. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డా.. తర్వాత పట్టించుకోవడం మానేశా. ఇప్పటికీ నేను మన సంప్రదాయ దుస్తులు ధరిస్తా. వెస్ట్రన్ వేర్ వేసుకున్నా సరే బొట్టు పెట్టుకోవడం మానను. నాకు కూచిపూడి, కథక్ వచ్చు. కర్ణాటిక్ సంగీతంతో ప్రవేశం ఉంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడే నటించే ఉద్దేశం లేదు. అందుకు ఇంకా సమయం ఉందనుకుంటున్నా” అని అవంతిక చెప్పింది.

This post was last modified on February 25, 2024 12:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ కోసం అలియా భట్ ఆలస్యం

ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలిగా మారిపోయిన అలియా భట్ కొత్త సినిమా జిగ్రా అక్టోబర్ 11 విడుదల కానుంది.…

9 mins ago

చెన్నైలో లేనిది.. హైదరాబాద్‌లో దొరికింది

తమిళ అభిమానులు కొన్నేళ్ల ముందు వరకు స్టార్ హీరోల కొత్త సినిమాలు రిలీజైనపుడు మామూలు హంగామా చేసేవారు కాదు. అక్కడ…

13 mins ago

రేప్ ఆరోపణలో టీడీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్

టీడీపీ నేత, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు రావడం పెను సంచలనం రేపింది. తనను బెదిరించి లైంగికంగా…

1 hour ago

మాజీ ఎంపీ స‌హా వైసీపీ నేత‌ల అరెస్టు.. పార్టీలో క‌ల్లోలం!

ఏపీలో ఒక‌వైపు వ‌ర‌దలు మ‌రోవైపు.. వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే స‌మయంలో రాజ‌కీయాలు కూడా అంతే…

5 hours ago

బొత్స‌కు బాధితుల సెగ‌.. ఏం జ‌రిగింది?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు.. వ‌ర‌ద బాధితుల నుంచి భారీ సెగ త‌గిలింది. వ‌ర‌ద‌ల‌తో…

6 hours ago

కత్తిరింపులు లేకుండా ‘ఖడ్గం’ చూపిస్తారా

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన సినిమాల్లో ఖడ్గంది ప్రత్యేక స్థానం. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంత ఓపెన్ గా చూపించిన…

6 hours ago