నాని కోసం సుజిత్ సూపర్ స్కెచ్

సాహో తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు న్యాయం జరిగేలా ఏకంగా పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ కొట్టేసి ఓజి చేస్తున్న దర్శకుడు సుజిత్ మరో జాక్ పాట్ కొట్టేశాడు. నానితో సినిమా గురించి కొద్దిరోజుల క్రితమే లీకయ్యింది కాబట్టి అందులో పెద్ద థ్రిల్ లేదు కానీ ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ వీడియోలో చెప్పిన కొన్ని కీలక విషయాలు ఆసక్తి రేపేలా ఉన్నాయి. హింసాత్మక బాటలో నడిచే ఒక వ్యక్తి, వందలాది మంది మీద పడినా అందరినీ మట్టి కురిపించే సత్తా ఉన్నోడు హఠాత్తుగా ఆయుధాలు వదిలేసి ఫుడ్ ట్రక్కు పెట్టుకుని కొత్త జీవనోపాధి చూసుకుంటే ఎలా ఉంటుందనే పాయింట్ చెప్పబోతున్నాడు.

లైన్ ఎలా ఉన్నా సరైన ఎలివేషన్లు, ట్విస్టులతో సుజిత్ రాసే స్క్రీన్ ప్లే మాములుగా ఉండదు. రన్ రాజా రన్ లోనే ఇది చూపించాడు. సాహోలో ముంబై టీమ్ ప్రమేయం ఎక్కువైపోయి కాస్త బ్యాలన్స్ తప్పిందనే మాటే కానీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే వేరేలా ఉండేదని ఇప్పటికీ కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఓజిలో ఆ ఫ్రీడం దొరికింది. సుజిత్ చెప్పింది చేయడం తప్ప పవన్ కళ్యాణ్ ఇంకేమి ఆలోచించడం లేదు. ఎంతగా ఇష్టపడ్డాడంటే దీనికన్నా ముందు మొదలైన వాటిని పక్కనపెట్టి మరీ ఓజి పూర్తి చేయడానికి డేట్లు ఇచ్చేంత. సో సుజిత్ ప్లానింగ్ ఆ రేంజ్లో ఉంటుంది.

ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య ఏకంగా రెండు పెద్ద సినిమాలు ఇవ్వడం బట్టే చెప్పొచ్చు ఇతని పనితనం ఏ స్థాయిలో ఉందో. సాహో ట్రైలర్ వచ్చినప్పుడు షారుఖ్ ఖాన్ నుంచి ఫోన్ కాల్ అందుకునే రేంజ్ నుంచి సినిమా రిలీజయ్యాక అవకాశాలు వస్తాయా రావా అనే దాకా ఇతను పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. చిరంజీవి గాడ్ ఫాదర్ ఆఫర్ ముందు తనకే ఇచ్చారు. కానీ హ్యాండిల్ చేయలేనన్న అనుమానంతో వదులుకున్నాడు. తీరా చూస్తే ఆ జడ్జ్ మెంట్ కరెక్ట్ అయ్యింది. మోహన రాజా సైతం బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయాడు. పవన్, నానిలకు హిట్లు ఇచ్చేస్తే సుజిత్ టాప్ లీగ్ లోకి వెళ్ళిపోతాడు