Movie News

అఘోరాల ప్రపంచంలో పోలీస్ ‘భీమా’

మాచో స్టార్ గోపిచంద్ హిట్టు చూసి చాలా కాలమే అయినా తనమీద ప్రేక్షకులకున్న ఆసక్తికి కొదవ లేదు. కాకపోతే సరైన సినిమా పడక సక్సెస్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఆ కొరత భీమా తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. శాండల్ వుడ్ ఫేమ్ హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏదో రెగ్యులర్ పోలీస్ డ్రామా అనుకున్నారు కానీ టీజర్ నుంచి క్రమంగా అంచనాలు మొదలైపోయాయి. ఇవాళ ట్రైలర్ చూశాక క్లారిటీ వచ్చింది. ఇదేదో రొటీన్ గా నడిచే ఖాకీ వర్సెస్ పొలిటీషియన్ బ్యాక్ డ్రాప్ కాదు. ఫాంటసీ టచ్ తో కొత్తగా ట్రై చేస్తున్న అభిప్రాయం కలిగించారు.

ఎక్కడో సుదూర తీరాన ఉండే పరశురామ క్షేత్రంలో సాక్ష్యాత్తు పరమశివుడే కొలువై ఉన్నాడని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే నిత్యం పూజా పురస్కారాలతో కొలుస్తూ ఉంటారు. ఎందరో అఘోరాలు అక్కడే ఉంటూ శివ కృప కోసం ఎదురు చూస్తుంటారు. అయితే కొందరు దుర్మార్గులు దాన్ని హస్తగతం చేసుకుని అరాచకాలకు నిలయంగా మార్చడంతో ఆ ఊరికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ భీమా(గోపిచంద్) దాన్ని కట్టడి చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉండే భయంకర వలయంలో అధికారిలా కాకుండా పరశురాముడిగా అడుగు పెడతాడు.

విజువల్స్ బాగున్నాయి. గోపీచంద్ ని గోలీమార్ తర్వాత మళ్ళీ అంతకంటే ఊర మాస్ పోలీస్ క్యారెక్టర్ లో చూడటం మాస్ కి కిచ్చి ఇచ్చేలా ఉంది. కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ నేపధ్య సంగీతం థీమ్ ని ఎలివేట్ చేసేలా సాగింది. ప్రియాంకా భవాని మోహన్ హీరోయిన్ గా నటించగా మాళవిక శర్మ, నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ఛమ్మక్ చంద్ర ఇలా భారీ తారాగణమే ఉంది. బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టు శివరాత్రి రోజు మార్చి 8 విడుదల కాబోతున్న భీమాని సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ నిర్మించారు. ట్రైలర్ కు తగ్గట్టు సినిమా ఉంటే భీముడి ఖాతాలో హిట్టు పడ్డట్టే

This post was last modified on February 24, 2024 5:16 pm

Share

Recent Posts

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

16 minutes ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

39 minutes ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

1 hour ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

4 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

5 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

12 hours ago