Movie News

సూర్య కోపం ‘శనివారం’ మాత్రమే

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం టీజర్ ఇవాళ హీరో పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. రెగ్యులర్ షూట్ కి ముందే చిన్న వీడియో తీసి ప్రత్యేకంగా కాన్సెప్ట్ ని పరిచయం చేసిన టీమ్ ఈ రోజు మరిన్ని కీలకమైన క్లూస్ తో స్టోరీకి సంబంధించిన గుట్టు విప్పింది. అంటే సుందరానికి తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కలయికలో ఇది రూపొందుతోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా జేక్స్ బెజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. మాస్ ట్రీట్ అని పెట్టిన ట్యాగ్ కి న్యాయం జరిగేలా కంటెంట్ ఇవ్వడం విశేషం.

సూర్య(నాని)కి కోపం ఎక్కువ. కానీ దాన్ని రోజూ ప్రదర్శించడు. కేవలం శనివారం మాత్రమే అతని ఆగ్రహం బయటికి వస్తుంది. అది కూడా ఒక పద్దతి ప్రకారం ప్రణాళిక వేసుకున్నట్టు తీస్తాడు. ఆ రోజు తలపడిన వాళ్ళు ఎవరైనా సరే చిత్తు కావాల్సిందే. కానీ సందర్భాలన్నీ అలా ప్లాన్ చేసుకుని రావు కదా. అయినా సరే సూర్య భావోద్వేగాలను ఎలా అణుచుకుంటాడు, ఇతని వెంటపడిన పోలీస్ ఆఫీసర్ (ఎస్జె సూర్య) వెనుక ఉన్న కథ, వీళ్లిద్దరి మధ్య వైరం లాంటి ఎన్నో ప్రశ్నలు తెరమీద చూడాలంటున్నారు. ఆగస్ట్ 29 విడుదల తేదీని వీడియో చివర్లో ప్రకటించేసారు.

సో రిలీజ్ డేట్ కి సంబంధించిన సస్పెన్స్ తీరిపోయింది. డివివి ఎంటర్ టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో తీస్తున్న సరిపోదా శనివారం కోసం వివేక్ ఆత్రేయ తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా యాక్షన్ ప్లస్ మాస్ ని ఎంచుకోవడం విశేషం. దసరా తర్వాత మళ్ళీ ఆ స్థాయి మాస్ ఇందులో చూడొచ్చని టాక్. ఆ ఫీల్ ని ఈ సినిమా కొనసాగిస్తుందని అభిమానుల నమ్మకం. క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే హాయ్ నాన్న తర్వాత కొత్త సినిమా విడుదలకు ఆరు నెలల సమయం పడుతున్నా నాని వెనుకాడకుండా సహకరిస్తున్నాడు. వేసవిలో షూటింగ్ పూర్తి చేసి జూలై చివరి వారం నుంచి ప్రమోషన్లు మొదలుపెడతారు.

This post was last modified on February 24, 2024 12:21 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

16 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

58 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

1 hour ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

1 hour ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago