చాలా ఏళ్ల కిందట మంచి హిట్ అయిన గీతాంజలి మూవీకి గీతాంజలి మళ్లీ వచ్చింది పేరుతో సీక్వెల్ తీస్తూ.. ఆ సినిమా పబ్లిసిటీ కోసం టీజర్ లాంచ్ వేదికగా హైదరాబాద్ పంజాగుట్టలోని శ్మశాన వాటికను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సినిమా థీమ్‌కు తగ్గట్లు టీజర్ లాంచ్ చేయడానికి శ్మశానాన్ని ఎంచుకోవడం లాజికల్‌గానే అనిపించినా.. పబ్లిసిటీ పేరుతో వెర్రెతలలు వేస్తున్నారన్న అభిప్రాయం కూడా పలువురి నుంచి వ్యక్తమైంది.
రెండు రోజుల పాటు ఈ చర్చ నడిచాక గీతాంజలి మళ్లీ వచ్చింది టీం ఆలోచన మార్చుకుంది. టీజర్ లాంచ్ వేదికను శ్మశాన వాటికలో చేయొద్దని నిర్ణయించుకుంది. బదులుగా హైదరాబాద్ సిటీలోనే సినిమా వేడుకలు జరిగే దసపల్లా కన్వెన్షన్‌లో ఈవెంట్ చేయడానికి డిసైడైంది.
టీజర్ లాంచ్ వేదికను మార్చడంపై టీం సరదాగానే స్పందించింది. ఆత్మల ఆత్మ గౌరవాన్ని, మనోభావాల్ని అర్థం చేసుకుంటూ.. భయభ్రాంతులవుతున్న మా యూనిట్ సభ్యులలను అర్థం చేసుకుంటూ.. కొంతమంది స్నేహితులు, పాత్రికేయుల సలహాలు సూచనలను గౌరవిస్తూ టీజర్ లాంచ్ వేదికను దసపల్లా కన్వెన్షన్‌కు మార్చినట్లు టీం ప్రకటించింది. శనివారం సాయంత్రం 7 గంటలకు ఈ వేడుక జరగబోతోంది.
చావులు, శ్మశానాల విషయంలో కామెడీ చేయడం తగదని.. జనాలు తమ ఆప్తులను సమాధి చేసిన ప్రాంతం విషయంలో ఎమోషనల్‌గా ఉంటారని.. అలాంటి చోట సినిమా వేడుకలు చేయడం ఎంత వరకు సమంజసం అనే అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లోనూ వ్యక్తం కావడంతో గీతాంజలి మళ్లీ వచ్చింది టీం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పటిదాకా చేసిన హంగామాతో సినిమాకు మంచి పబ్లిసిటీ అయితే వచ్చిందన్నది వాస్తవం.
This post was last modified on February 23, 2024 11:43 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…