బిగ్ బాస్ తాజా సీజన్‍లో ఇంతవరకు ప్రసారమయినవి రెండే ఎపిసోడ్లు కానీ ఇప్పటికే కొందరు కంటెస్టెంటుల పట్ల ఆడియన్స్ కి ఒక ఖచ్చితమైన అభిప్రాయం వచ్చేసింది. కరాటే కళ్యాణి అయినదానికీ, కాని దానికీ పక్క వారితో గొడవకు దిగుతూ ఫుటేజ్ కోసం నానా తంటాలు పడుతోంది. ఆమెతో ఏమి మాట్లాడితే ఏమి సమస్య వస్తుందోనని మిగతా వాళ్లు జంకి, జంకి మాట్లాడే పరిస్థితి వుంది. ఈమె కనుక తొలివారం నామినేషన్లలో వుండి వుంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎలిమినేట్ అయి వుండేదని షో ఫాలోవర్స్ నిశ్చితాభిప్రాయం. ఇక దర్శకుడు సూర్యకిరణ్ ఎప్పుడూ చిరాగ్గా, విసుగ్గా వుంటున్నాడు. ఎవరు ఏమి మాట్లాడినా వాళ్లు ‘ఇమ్మెచ్యూర్’ అంటూ ఫైర్ అవుతున్నాడు. ఇతడు నామినేషన్స్ లో వున్నాడు కనుక ఫస్ట్ వికెట్ ఇతడిదే కావచ్చునని అంటున్నారు.
ఇక మోనల్ గజ్జర్ అయితే కారణం వెతుక్కుని ట్యాప్ ఓపెన్ చేసేస్తోంది. మధుప్రియ, తీన్‍మార్ సావిత్రి తర్వాత ‘పాతాళగంగ’ ఈవిడేనంటూ ట్రోల్స్ ఒక ఆటాడుకుంటున్నారు. జోర్దార్ సుజాత, అరియాన లాంటి కొందరు యాక్టివ్‍గా వుండగా, దివి, హారిక లాంటి కొందరు పూర్తిగా అవుట్ ఫోకస్‍లో వుంటున్నారు. గంగవ్వ పట్ల ఆడియన్స్ సింపతీ చూపిస్తున్నారు కానీ ఇలాంటి షోలో ఆమె ఎంతకాలం కొనసాగగలదనేది అనుమానమే. రెండు రోజులలోనే అరుపులు, ఏడుపులతో విసిగించేసిన కంటెస్టెంట్స్ ఇక ముందయినా వినోదం పండిస్తారో లేదో చూడాల్సిందే.
This post was last modified on September 9, 2020 10:27 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…