గత వారం విడుదలైన వాటిలో ఊరిపేరు భైరవకోన డీసెంట్ ఓపెనింగ్స్ తో మొదలై మంచి వసూళ్లను రాబట్టినా నాలుగో రోజుకే నెమ్మదించి బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేయలేకపోయింది. బ్రేక్ ఈవెన్ ఆదివారానికి దాటేస్తుందనే లెక్కల నేపథ్యంలో ఫైనల్ స్టేటస్ గురించి ఇప్పుడే కామెంట్ చేయలేం. రేపు ఫిబ్రవరి 23 ఏకంగా తొమ్మిది సినిమాలు తమ అదృష్టాన్ని బాక్సాఫీస్ వద్ద పరీక్షించుకోబోతున్నాయి. హర్ష చెముడు ‘సుందరం మాస్టర్’ హీరో ఇమేజ్ కన్నా కంటెంట్ ని నమ్ముకుని రిస్క్ చేస్తోంది. ట్రైలర్ గట్రా ఆడియన్స్ లో ఆసక్తి రేపాయి కానీ ఎంతమేరకు ఓపెనింగ్స్ వస్తాయనేది టాక్ ని బట్టి ఉంటుంది.
కమెడియన్ అభినవ్ గోమటం హీరోగా పరిచయమవుతున్న ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ ఎక్కువ యూత్ ని నమ్ముకుని బరిలో దిగుతోంది. జనాల దృష్టి ప్రస్తుతానికి దీని మీద లేదు. బాగుందనే మాట వినిపిస్తే పికప్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ వెనుక ఉద్దేశం రాజకీయమే కాబట్టి ప్రత్యేకంగా వైసిపి అనునయులకు తప్ప సాధారణ ప్రేక్షకులకు దీని మీద ఆసక్తి లేదు. మలయాళంలో సెన్సేషన్ గా నిలిచిన బ్లాక్ అండ్ వైట్ మూవీ ‘భ్రమ యుగం’ని సితార సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడంతో మంచి రిలీజ్ దక్కుతోంది. అయితే ప్రమోషన్లు లేని కారణంగా పబ్లిక్ లో ఇంకా రిజిస్టర్ కాలేదు.
సుకుమార్ దృష్టిలో పడ్డ యశస్వి దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సిద్దార్థ్ రాయ్’తో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరో అవుతున్నాడు. అర్జున్ రెడ్డి ఛాయలు ఎక్కువగా ఉన్నాయనే నెగటివ్ కామెంట్స్ దాటుకుని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. ఇవి కాకుండా ముఖ్య గమనిక, 14 డేస్ లవ్, ప్రేమలో ఇద్దరు, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతిలు రేస్ లో ఉన్నాయి. యామి గౌతమ్-ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన ‘ఆర్టికల్ 350’తో పాటు తుపాకీ విలన్ విద్యుత్ జమాల్ హీరోగా నటించిన ‘క్రాక్’ బాలీవుడ్ నుంచి దిగుతున్నాయి. ఇన్నేసి ఆప్షన్ల మధ్య ప్రేక్షకులు రేపు వేటికి ఓటు వేస్తారో వేచి చూడాలి.
This post was last modified on February 22, 2024 12:53 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…