Movie News

99 రూపాయల టికెట్ మనకెందుకు లేదు

రేపు దేశవ్యాప్తంగా పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో ఏ సినిమా ఏ స్క్రీన్ లో అయినా సరే కేవలం 99 రూపాయలకే చూసేయొచ్చు. కానీ ఆ అవకాశం తెలుగు రాష్ట్రాల్లో లేదు. తెలంగాణలో కనిష్టంగా 112, ఆంధ్రప్రదేశ్ లో యథావిధిగా 177 చెల్లించుకోవాల్సిందే. కానీ ఉత్తరాది ఆడియన్స్ మాత్రం ఆర్టికల్ 370, క్రాక్ లాంటి లేటెస్ట్ రిలీజులు చవక ధరలో చూసేస్తారు. రేపు మన దగ్గర సుందరం మాస్టర్, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా లాంటి చిన్న చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వాటికి 99 రేట్ పెడితే ఎక్కువ శాతం ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హౌస్ ఫుల్స్ కూడా కావొచ్చు.

కానీ జిఓ పరిమితులు, ప్రభుత్వ అనుమతులు క్లిష్టంగా ఉన్న కారణంగానే ఇక్కడ అమలు చేయలేకపోతున్నామని ఆఫ్ ది రికార్డ్ పివిఆర్ వర్గాలు అంటుండగా మూవీ లవర్స్ మాత్రం ఇది కేవలం వివక్షని, సినిమాలు చూడకుండా ఉండలేని దక్షిణాది ప్రేక్షకుల బలహీనతను ఆసరాగా చేసుకుని తగ్గింపు ఇవ్వడం లేదని భగ్గుమంటున్నారు. ఏపీలో మరీ అన్యాయంగా ఇలాంటి సందర్భాల్లోనూ ప్రత్యేక వెసులుబాటు లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. సలార్ లాంటి వాటికి పెంపు ఇచ్చినప్పుడు ఈ సమయంలో డిస్కౌంట్లు ఇవ్వాలనేది వాళ్ళ వాదన. అందులో లాజిక్ ఉంది కానీ వినేవారెవరు.

ఏదో ఒకటి రెండు రోజులు కాకుండా బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టుకోని చిన్న సినిమాలకు తగ్గింపు రేట్లు చాలా మేలు చేస్తాయి. పది మంది కూడా రాలేదని షోలు క్యాన్సిల్ చేసే బదులు తక్కువ ధర కాబట్టి వందల్లో వచ్చే జనాలతో హౌస్ ఫుల్ చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైవా హర్ష, అభినవ్ లాంటి వాళ్ళు ఎంత ప్రమోట్ చేసుకున్నా ఓపెనింగ్స్ రావడం కష్టంగా కనిపిస్తోంది. అలాంటప్పుడు ఆఫర్లు గట్రా ఇస్తే పబ్లిక్ ఆకర్షితులవుతారు. కానీ జరుగుతున్నది వేరే. బాలీవుడ్ మూవీ ఆర్టికల్ 350కి నార్త్ లో అడ్వాన్స్ బుకింగ్ లోనే 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం బట్టి చెప్పొచ్చు ఈ పధకం ఎంత సక్సెసో.

This post was last modified on February 22, 2024 12:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

50 minutes ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

55 minutes ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

2 hours ago

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

2 hours ago

ఏమిటీ ‘అనుచితాల’.. ఆపండి: బీజేపీపై ఆర్ ఎస్ ఎస్ ఆగ్ర‌హం!

బీజేపీ మాతృ సంస్థ‌.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ ఎస్ ఎస్‌).. తాజాగా క‌మ‌ల నాథుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు…

3 hours ago

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

4 hours ago