రియా చక్రవర్తి అరెస్ట్ నేపథ్యంలో ఆమెకి సపోర్ట్ గా సినిమా వాళ్ల గళాలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సుషాంత్ సింగ్ కోసం ఆమె డ్రగ్స్ పలుమార్లు కొన్నదని, కొందరితో కొనిపించిందని ఆమెపై ఎఫ్‍ఐఆర్‍లో నమోదైన ఆరోపణ. అందులో ఆమె డ్రగ్స్ తీసుకుందనే ప్రస్తావన ఎక్కడా లేదు. చనిపోయిన సుషాంత్ కోసమే ఆమె ఈ పని చేసినట్టు మాత్రం అందులో వుంది. దీంతో సుషాంత్ సింగ్ బ్రతికి వున్నట్టయితే ఈ కేసులో అతనే నిందితుడయ్యే వాడని, అతని కోసం ఆమె డ్రగ్స్ కొన్నప్పుడు ఆమెను ఎందుకు నిందితురాలిని చేస్తున్నారని బాలీవుడ్ ప్రముఖులు ఆమెకి సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు.
దర్శకుడు అనురాగ్ కశ్యప్ అయితే ఒక అడుగు ముందుకు వేసి చనిపోయిన వ్యక్తి గురించి కొన్ని మాట్లాడకూడదు కాబట్టి ఇంతకాలం మౌనంగా వున్నామని, ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి కనుక మాట్లాడక తప్పట్లేదని వ్యాఖ్యానించాడు. ఇలాంటి నర్మ గర్భ వ్యాఖ్యలు ఇంకా పలువురు బాలీవుడ్ ప్రముఖులు చేస్తున్నారు. వారి మాటలను బట్టి సుషాంత్ సింగ్ డ్రగ్ అడిక్ట్ అని బాలీవుడ్‍లో అందరికీ తెలుసుననే అర్థం వస్తోంది.
చనిపోయిన వాడు తనను తాను డిఫెండ్ చేసుకోలేడు కనుక అతడిని నిందితుడిగా చూపిస్తున్నారా అంటూ సుషాంత్ సోదరి బాలీవుడ్‍లో రియాకు సపోర్ట్ గా నిలబడిన వారిని నిలదీస్తోంది. ఆమె మాటలు కూడా నిజమే. ఒక వ్యక్తి ఇప్పుడు లేడు కనుక, డ్రగ్స్ కొన్నాను కానీ, అతని కోసమే అనేస్తూ వుండొచ్చుగా? డ్రగ్స్ అసలు తాను తీసుకోలేదని చెబుతోన్న రియా మాటలలో నిజమెంత? అది సుషాంత్ అయితే వచ్చి చెప్పలేడుగా? నోరెత్తుతున్న పెద్దలు దీనిని కూడా కన్సిడర్ చేయాలి మరి.
This post was last modified on September 9, 2020 10:16 pm
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…