టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్స్ లో ఒకటిగా నిలిచిన శివ గురించి దశాబ్దాలు గడుస్తున్నా ఫిలిం మేకర్స్ ఆ మాస్టర్ పీస్ నుంచి నేర్చుకుంటూనే ఉంటారు. రామ్ గోపాల్ వర్మ అనే సంచలనాన్ని నాగార్జున పరిచయం చేసిన తీరు ఎప్పటికీ మర్చిపోలేని సాహసం. 1989లో రిలీజైన ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ ని రీ రిలీజ్ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కొన్నేళ్ల క్రితం జరిగిన పాతికేళ్ల యానివర్సరి వేడుకలో త్వరలోనే చేస్తామని హీరో కం నిర్మాత నాగార్జున ప్రకటించారు కానీ సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. మరోసారి దాని ప్రస్తావన తెరపైకి వచ్చింది.
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న వ్యూహం ప్రమోషన్ల సందర్భంగా తనను అడిగిన మీడియాతో మాట్లాడిన వర్మ శివ 4కె పనులు పూర్తయ్యాయని, ఎప్పుడు థియేటర్లలో వదలాలన్నది అన్నపూర్ణ స్టూడియోస్ నిర్ణయమని చెప్పుకొచ్చారు. అయితే దగ్గరలో ఆ సూచనలేమి కనిపించడం లేదు. గత రెండేళ్లుగా రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇదే బ్యానర్ నుంచి వచ్చిన మన్మథుడుని జనాలు బ్రహ్మాండంగా ఆదరించారు. అయితే శివ కేసు వేరు. ఇప్పటి పాతిక ముప్పై ఏళ్ళ కుర్రాళ్ళకు శివ థియేటర్ ఎక్స్ పీరియన్స్ తెలియదు. టీవీ, ఫోన్, ఓటిటిలో తప్ప చూసి ఎరుగరు.
అలాంటిది పెద్ద తెరపై చూపిస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. రఘువరన్ విలనీ, ఇళయరాజా పాటలు, మతి పోగొట్టే రీ రికార్డింగ్, అవార్డు సాధించిన గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం, జెడి చక్రవర్తి లాంటి టాలెంట్స్ ని పరిచయం చేసిన వైనం ఒకటా రెండా శివ కబుర్ల గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. నాగార్జున, అమల బంధం మరింత బలపడింది కూడా ఈ సెట్లోనే. అయితే ఒరిజినల్ నెగటివ్ లో కొంత భాగం మరమత్తులో ఉందని ఇప్పట్లో అవ్వకపోవచ్చని మరో టాక్ ఉంది. ఏదైతేనేం వీలైనంత త్వరగా బిగ్ స్క్రీన్ మీద శివని చూపిస్తే ఆ కిక్కే వేరని ఎవరైనా ఒప్పుకుంటారు.
This post was last modified on February 21, 2024 9:03 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…