ఇటీవలే రీ రిలీజ్ జరుపుకున్న ఓయ్ సినిమాకు దక్కిన రెస్పాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏదో ఫామ్ లో ఉన్న టాలీవుడ్ స్టార్ మూవీ అనుకుంటే ఏదోలే అనుకోవచ్చు. ఆ మధ్య చిన్నా చూడండి అని నెత్తి నోరు బాదుకున్నా పట్టించుకోని సిద్దార్థ కథానాయకుడిగా వచ్చిన పాత చిత్రం. అయినా సరే జనాలు ఎగబడి చూశారు. ముఖ్యంగా యూత్ పాటలకు థియేటర్లలో లేచి మరీ డాన్సులు చేశారు. దెబ్బకు సిద్దార్థ్ చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చి మరీ శాంతి థియేటర్లో జరిగిన రచ్చని కళ్లారా చూసి షాక్ అయ్యాడు. నిజంగా ఇది తన ఓయేనా అని షాక్ తో ఆనందపడ్డాడు.
ఇప్పుడు దర్శకుడు ఆనంద్ రంగా సంతోషం బాధ కలిగిన ఫీలింగ్ తో వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓయ్ ని ఇంతగా ప్రేమిస్తున్న వాళ్ళు ఒరిజినల్ గా రిలీజైన టైంలోనే ఈ స్పందన చూపించి ఉంటే నాకో కెరీర్ దక్కేదని నిరాశను వ్యక్తం చేశారు. సెకండ్ హాఫ్ ని సరిగా హ్యాండిల్ చేయకపోవడం తప్పేనని ఒప్పుకుంటూనే మరీ తిరస్కరించేంత చెడ్డ సినిమా కాదని కూడా చెప్పుకొచ్చారు. ఆయన అన్నదాంట్లో పాయింట్ ఉంది. ఒకవేళ ఓయ్ నిజంగా హిట్ అయ్యి ఉంటే ఎన్నో కొన్ని సినిమాలు తీసేవాడుగా. దెబ్బకు ఇండస్ట్రీకి దూరమై ఏళ్ళ తరబడి అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది.
ఆ మధ్య ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో సుష్మిత కొణిదెల నిర్మించిన షూట్ అవుట్ ఏట్ అలైర్ దర్శకుడు ఈయనే. ఇది వెబ్ సిరీస్ కావడంతో జనాలకు ఆశించిన స్థాయిలో రీచ్ కాలేదు. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో రూపొంది టెక్నికల్ గా మంచి పేరే తెచ్చుకుంది. ఇప్పుడు ఈయన వర్క్ ని చూసి ఎవరైనా నిర్మాత అవకాశం ఇవ్వకపోరాని ఓయ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆరంజ్ విషయంలో బొమ్మరిల్లు భాస్కర్ సైతం ఇలాంటి పరిస్థితిని చవిచూశాడు కానీ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కంబ్యాక్ ఇచ్చి ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డతో జాక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 19, 2024 5:04 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…