ఏడాది ముందు వరకు పూజా హెగ్డే టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్. క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ.. భారీ పారితోషకం తీసుకుంటూ.. డైరీలో ఖాళీయే లేనట్లు కనిపించిందామె. కానీ చూస్తుండగానే ఆమె జోరు తగ్గిపోయింది. వరుసగా తన సినిమాలు ఫ్లాప్ కావడం.. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజీ ప్రాజెక్టుల నుంచి బయటికి వచ్చేయడంతో ఆమె కథ తిరగబడింది. కొత్త అవకాశాలు ఆగిపోయాయి. సడెన్‌గా కెరీర్ డల్ అయిపోయింది.
తెలుగులో అసలు అవకాశాలే లేకుండా ఖాళీ అయిపోవడం అనూహ్యం. పూజా కూడా తెలుగు సినిమాలను లైట్ తీసుకుని బాలీవుడ్లో బిజీ అవ్వాలని చూస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అక్కడ కూడా ఆమె కెరీర్ ఏమీ ఆశాజనకంగా లేదు. దీంతో మళ్లీ తెలుగు సినిమాల మీద ఆమె ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
పూజా ఎన్నడూ లేని విధంగా డిస్కౌంట్ బేరాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు 3 కోట్లకు అటు ఇటుగా పారితోషకం పుచ్చుకున్న పూజా.. ఇప్పుడు అందులో సగం మొత్తానికి కూడా సినిమా చేయడానికి రెడీగా ఉందట. మిడ్ రేంజ్ సినిమాలు చేయడానికి కూడా ఆమె సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం.
తాజాగా పూజా సౌత్ సినిమాలకు శైలికి తగ్గట్లు ట్రెడిషనల్ లుక్స్‌తో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది పూజా. ఆమెలో ఛార్మ్ ఎంతమాత్రం తగ్గలేదనిపిస్తోంది. మరి పూజా డిస్కౌంట్ బేరాలు ఆమెకు అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూాడాలి.
This post was last modified on February 19, 2024 5:04 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…