మాములుగా స్పైడర్ మ్యాన్ అంటే విదేశాల్లోనే కాదు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. సాలెగూడు మనిషి చేసే అద్భుతాలు దశాబ్దాలు గడుస్తున్నా, ఎన్ని భాగాలు తీస్తున్నా ఆడియన్స్ ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే సీక్వెల్ అనౌన్స్ చేయడం ఆలస్యం క్రేజ్ వచ్చి పడుతుంది. దీనికి దగ్గరగా ఉండే కాన్సెప్ట్ తో మేడమ్ వెబ్ అనే కామిక్ సిరీస్ అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. దాన్ని సినిమాగా తీస్తే ఆడియన్స్ ఎగబడి చూస్తారనే ఆలోచనతో సోనీ, మర్వెల్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించాయి. మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తీరా చూస్తే ఈ మేడమ్ వెబ్ థియేటర్ కు వచ్చిన జనాలను అయ్యో బాబోయ్ అంటూ పరిగెత్తేలా చేసింది. వచ్చిన టాక్ ప్రకారం చూసుకుంటే ఎంత లేదన్నా 100 మిలియన్ డాలర్ల నష్టం తప్పదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం గ్రాఫిక్స్ ని నమ్ముకుని కంటెంట్, ఎమోషన్స్ ని గాలికి వదిలేస్తున్న హాలీవుడ్ మేకర్స్ కి ఇదో గుణపాఠంగా నిలుస్తుందని తలంటుతున్నారు. కనీసం పిల్లలను ఆకట్టుకునేలా ఉన్నా ఏదోలా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కొచ్చు కానీ వాళ్ళను సైతం కనీస స్థాయిలో మెప్పించలేకపోతే వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రయోజనం ఏంటని దుమ్మెత్తి పోస్తున్నారు.
క్లార్క్ సన్ దర్శకత్వం వహించిన ఈ అద్భుత కళాఖండంకు మొదటి రోజే చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అవుతున్న దుస్థితి వచ్చేసింది. పట్టుమని రెండు గంటల పాటు ఎంగేజ్ చేయలేనంత నాసిరకంగా సినిమా తీసినందుకు మార్వెల్ ఖచ్చితంగా చింతిస్తుంది. ఇదే తరహాలో మొన్నామధ్య వచ్చిన ది మార్వెల్స్ ఘోరంగా దెబ్బ తినగా గత రెండేళ్లుగా తీసిన సినిమాల నుంచి ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. మనం ఇక్కడ ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లాంటివి రొటీన్ కంటెంట్ అంటూ ట్రోల్ చేస్తాం కానీ హాలీవుడ్ లో మేడమ్ వెబ్ లాంటివి అంతకు మించే టార్చర్ పెడుతున్నాయి.
This post was last modified on February 18, 2024 2:26 pm
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…