పేరుకి తమిళ హీరోలే అయినా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్లు సూర్య, విక్రమ్. తమ కెరీర్లలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు ఒకే సమయంలో చేయడం విశేషమే అయినా ఇద్దరికీ ఒకే రకమైన సమస్య తలెత్తడం కాకతాళీయం. సిరుతై శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువాని ముందు ఏప్రిల్ రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ బడ్జెట్ చేయి దాటిపోవడంతో పాటు విఎఫెక్స్, పోస్ట్ ప్రొడక్షన్లో విపరీతమైన ఆలస్యం జరగడంతో ఇప్పుడు ఏకంగా దసరా లేదా దీపావళికి ప్లాన్ చేసుకుంటున్నారట. కానీ దానికీ గ్యారెంటీ లేదు. అందుకే డేట్ అనౌన్స్ మెంట్ రావడం లేదు.
తంగలాన్ కూడా ఇదే రకమైన ఇబ్బందిని ఎదురుకుంటోంది. పా రంజిత్ డైరెక్షన్ లో విభిన్నమైన సెటప్ లో అడవి మనుషుల నేపథ్యంలో తీస్తున్నారు. టీజర్ చూశాక ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలిగింది. ముఖ్యంగా విక్రమ్ గెటప్ చూశాక మళ్ళీ ఏదో ప్రాణాల మీద తెచ్చుకునే స్టంట్లు చేశాడని అర్థమైపోయింది. మొదటి జనవరి 26 ప్రకటించారు. తర్వాత వాయిదా వేశారు. పోనీ మార్చి లేదా ఏప్రిల్ అనుకుంటే తమిళనాడు ఎన్నికలు ఉంటాయి కాబట్టి వద్దనుకుని ఇంకో ఆప్షన్ వైపు చూస్తున్నారు. కంగువాతో క్లాష్ కాకూడదనేది కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల మూకుమ్మడి అభిప్రాయం.
కంగువా, తంగలాన్ కు ఇంకో టెన్షన్ ఉంది. డేట్ లాక్ చేసుకునే ముందు తెలుగు ప్యాన్ ఇండియా మూవీస్ ఏమున్నాయో చూసుకోవాలి. ఓజి, దేవర పార్ట్ 1, పుష్ప 2 ది రూల్, గేమ్ ఛేంజర్ వీటితో తలపడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇవి కర్ణాటక లాంటి బయట మార్కెట్లలో ఓపెనింగ్స్ ని దెబ్బ తీస్తాయి. సో ఎన్నో క్యాలికులేషన్లు వేసుకుంటే తప్ప నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. 2025 జనవరి బెటరనే ఆలోచన చేస్తున్నారు కానీ ఈ సంవత్సరం అయలాన్, కెప్టెన్ మిల్లర్ లకు టాలీవుడ్ సంక్రాంతికి ఎంట్రీ లేకపోవడం చూసి తెలివిగా ప్లాన్ చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
This post was last modified on February 17, 2024 5:37 pm
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…