సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజవుతుంటే.. బాక్సాఫీస్ దగ్గర, సోషల్ మీడియాలో ఉండే హంగామానే వేరు. ఆయన ఎలాంటి సినిమా చేసినా.. ఎలాంటి దర్శకుడితో జట్టు కట్టినా.. జనాలు సినిమా చూడ్డానికి ఎగబడతారు. ప్రి రిలీజ్ హైప్ ఒక రేంజిలో ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతాయి. కానీ ‘లాల్ సలాం’ అనే సినిమా విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. ఈ పేరుతో ఓ సినిమా రిలీజవుతున్నట్లే జనాలకు పెద్దగా తెలియని పరిస్థితి.
తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా ‘లాల్ సలాం’ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేకపోయింది. రజినీ చిన్న క్యామియో రోల్ ఏమీ చేయలేదు ఇందులో. ముప్పావుగంట కనిపించే కీలకమైన పాత్రే. అయినా ప్రేక్షకులు ఈ పాత్రతో, సినిమాతో కనెక్ట్ కాలేదు. రజినీ అంటే ప్రేక్షకులు ఫైర్ వర్క్స్ ఆశిస్తారు. కానీ రజినీ కూతురు ఆయన్ని ఒక ఉదాత్తమైన పాత్రలో చూపించి సందేశాలు ఇప్పించే ప్రయత్నం చేసింది. అది ప్రేక్షకులకు ఎంతమాత్రం రుచించలేదు. పోనీ సినిమా అయినా ఒక తీరుగా నడిచిందా అంటే అదీ లేదు. అనేక అంశాలను చూపించే క్రమంలో కన్ఫ్యూజ్ అయిపోయింది.
‘లాల్ సలాం’కు ప్రి రిలీజ్ బజ్ లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ కూడా సరిగా లేవు. తెలుగులో అయితే సినిమా పూర్తిగా వాషౌట్ అయిపోయింది. తమిళంలో కూడా వసూళ్లు మరీ కనీస స్థాయిలో వచ్చాయి. రజినీ సినిమాకు మామూలుగా తొలి రోజు వచ్చే ఓపెనింగ్స్ స్థాయిలో కూడా ఫుల్ రన్ కలెక్షన్లు లేకపోవడం షాకిచ్చే విషయం. కేవలం రూ.30 కోట్ల లోపు వసూళ్లతో ఈ సినిమా రన్ పూర్తయింది. తెలుగులో రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి. మొత్తంగా తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో చేసిన సినిమా రజినీకి కెరీర్లోనే అతి పెద్ద మరకగా మిగిలిపోయింది.
This post was last modified on February 17, 2024 2:11 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…