అన్ని సవ్యంగా ప్లానింగ్ ప్రకారం జరిగి ఉంటే ఇంకో ఇరవై రోజుల్లో డబుల్ ఇస్మార్ట్ విడుదలకు సిద్ధంగా ఉండేది. కానీ షూటింగ్ తో పాటు పాటల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా తప్పలేదు. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. దర్శకుడు పూరి జగన్నాధ్ దీన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతోనే మొదలుపెట్టాడు కానీ బడ్జెట్ చేయి దాటిపోవడం వల్లే కొంత బ్రేక్ వేయాల్సి వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఇస్మార్ట్ శంకర్ బ్రాండ్ కన్నా హీరో దర్శకుడి మీద గత డిజాస్టర్ల ప్రభావం వల్లే ఆశించిన రేట్లు రావడం లేదని వినికిడి.
ఇప్పుడు దీన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో పూరి పలు ప్లాన్లు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. అందులో మొదటిది టీజర్ కట్. ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తాను ప్రేక్షకులకు ఏం చూపించబోతున్నానో ఒక శాంపిల్ వదిలితే హైప్ ఆటోమేటిక్ గా పెరుగుతుందనేది వాటిలో మొదటిది. రెండో ఆప్షన్ బాగా వైరలయ్యే అవకాశమున్న ఒక పాటని లిరికల్ వీడియో రూపంలో రిలీజ్ చేయడం ద్వారా జనాల అటెన్షన్ ని డబుల్ ఇస్మార్ట్ వైపు తిప్పుకోవచ్చు. లైగర్ దెబ్బకు పూరిని అంత ఈజీగా నమ్మే పరిస్థితిలో బయ్యర్లు లేరు. చాలా అతిశయోక్తిగా దాని గురించి చెప్పిన మాటలు దారుణంగా బోల్తా కొట్టించాయి.
ఇంకోవైపు రామ్ మీద స్కంద, ది వారియర్ ల దెబ్బ గట్టిగా పడింది. ఓపెనింగ్స్ అయితే లాగుతున్నాడు కానీ కంటెంట్ ఏ మాత్రం యావరేజ్ ఉన్నా రెండో వారం లోపే చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి. సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ క్యాస్టింగ్ ఉన్నా డబుల్ ఇస్మార్ట్ మీద హైప్ పెరగాలంటే మేజిక్ అనిపించే ప్రమోషన్లు జరగాలి. అందుకే ఇప్పుడొచ్చిన గ్యాప్ ని దానికోసమే పూరి వాడుకుంటారని తెలిసింది. ఓటిటి సంస్థలతో జరుగుతున్న బేరాలు ఒక కొలిక్కి రాకపోవడం కూడా ఆలస్యానికి కారణంగా వినిపిస్తోంది. వేసవిలో రావాలంటే మాత్రం ఇప్పుడున్న స్పీడ్ ని డబుల్ చేయాల్సిందే.
This post was last modified on February 16, 2024 12:17 pm
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…