సెలబ్రిటీ టాక్ షోలకు ఈ మధ్య ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన ఈ కల్చర్ బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు అన్ స్టాపబుల్ చేయడం ద్వారా తెలుగు లోగిళ్ళలోకి వచ్చేసింది. దాన్ని మరిపించే స్థాయిలో ఎవరూ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు టాపిక్ మన గురించి కాదు లెండి. సీనియర్ హీరోయిన్ నేహా ధూపియా గుర్తుందా. అప్పుడెప్పుడో రాజశేఖర్ విలన్ సినిమాలో హీరోయిన్ గా నటించాక కనిపించకుండా పోయింది. ఒకప్పుడు గ్లామర్ షోతో ఆడియన్స్ ని మురిపించిన ట్రాక్ రికార్డు ఆమెది. నో ఫిల్టర్ నేహా పేరుతో ఆవిడ చేసే ఆడియో పాడ్ క్యాస్ట్ బాగా పాపులర్.
ఇప్పటిదాకా అయిదు సీజన్లు చేస్తే అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని వీడియో రూపంలోకి మార్చబోతున్నారు. ఈ షోలో ఎలాంటి మొహమాటాలు లేకుండా గెస్టులు మాట్లాడాల్సి ఉంటుంది. సినిమాల నుంచి వ్యక్తిగత జీవితాల వరకు అన్ని విషయాలు ప్రస్తావనకు తెస్తుంది నేహా. కేవలం వినడానికి పరిమితమైన నో ఫిల్టర్ నేహాని జియో టీవీ తెరముందుకు తెస్తోంది. మొదటి అతిథుల లిస్టులో రష్మిక మందన్న ఉందట. యానిమల్ తర్వాత ఉత్తరాదిలో తనకు పాపులారిటీ పెరగడాన్ని గురించి ఇలా ప్లాన్ చేసుకున్నారు. అంతకు ముందు పుష్ప తెచ్చిన ఇమేజ్ చిన్నది కాదు.
గత కొంత కాలంగా వివిధ అంశాల గురించి వార్తల్లో నిలుస్తున్న రష్మిక మందన్న ఏం షేర్ చేసుకుంటుందోననే ఆసక్తి సహజంగానే అభిమానుల్లో ఉంటుంది. ముఖ్యంగా విజయ దేవరకొండతో బంధం గురించి ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లో ఏకంగా జోకు కూడా వేశారు. అయినా సరే ఇప్పటిదాకా దాని గురించి దాటవేస్తూ వచ్చిన రష్మిక మందన్న మరి నేహా ముందు ఏమైనా ఓపెన్ అవుతుందేమో చూడాలి. పుష్ప 2 ది రూల్, గర్ల్ ఫ్రెండ్,చావ షూటింగ్స్ లో బిజీగా ఉన్న రష్మిక రైన్ బో నుంచి తప్పుకుందనే వార్త తిరుగుతోంది కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
This post was last modified on February 14, 2024 6:07 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…