ఇప్పుడంటే అర్జున్ రెడ్డి, యానిమల్ అంటూ అగ్రెసివ్ హీరోయిజం గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఒకప్పుడు A సినిమాతో దాన్ని కొత్తగా పరిచయం చేసింది ఉపేంద్రనే. అది సృష్టించిన సెన్సేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరో పాత్ర ఇలా కూడా ప్రవర్తిస్తుందా అంటూ దాని గురించి అప్పట్లో ప్రేక్షకులు విపరీతంగా చర్చించుకున్నారు. తర్వాత ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఉపేంద్ర, సూపర్ లాంటివి వివాదాస్పద అంశాలను స్పృశించాయి. త్వరలో UIతో రాబోతున్నాడు. ఆ మధ్య వదిలిన టీజర్ అర్ధమయ్యి కానట్టు ఆడియన్స్ కి చాలా వెరైటీగా అనిపించింది.
వచ్చే 26న చీప్ సాంగ్ ని లిరికల్ వీడియో రూపంలో రిలీజ్ చేయబోతున్నారు. ఇవాళ చిన్న శాంపిల్ ని వదిలారు. నీకంటే నాది పెద్దది, వాడికంటే నీది చిన్నది అంటూ వెరైటీ పదాలతో రాంబాబు గోసాల రచన చేయగా విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చారు. చూస్తుంటే ఇదేదో కాస్త డబుల్ మీనింగ్ తరహాలో అనిపిస్తున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఉపేంద్ర ఉద్దేశం ఏదైనా దాన్ని అర్థం చేసుకునే వాళ్లలో అధిక శాతం నెగటివ్ కోణంలో చూసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఉప్పి దాదా కాన్సెప్ట్ కూడా అదే. వైరల్ కావాలంటే ఇంతకన్నా మార్గం లేదు.
మొత్తం పాట విన్నాక పూర్తి అవగాహన వస్తుంది కానీ చీప్, పెద్దది, చిన్నది అనే లిరిక్స్ తో ఉపేంద్ర అభిమానుల్లో చర్చకు దారి తీసేలా వదిలారు. ఇది మాములు సినిమాలా ఉండదని, చూశాక మిమ్మల్ని అంతుచిక్కని రీతిలో షాక్ కి గురి చేస్తానని పలు ఇంటర్వ్యూలలో ఉపేంద్ర చెబుతూ వస్తున్నారు. రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు కానీ ప్యాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో ఒకేసారి ప్లాన్ చేస్తున్నారు. ముప్పై సంవత్సరాల తర్వాత ఇంకో ట్రెండ్ సెట్టర్ ఇస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చీప్ అంటూనే చివర్లో కాస్ట్లీ అంటూ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం కొసమెరుపు
This post was last modified on February 14, 2024 11:17 am
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…
రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…
ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…
ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…