బాక్సాఫీస్ వద్ద సునామిలాగా దూసుకొచ్చిన హనుమాన్ 300 కోట్లు కొల్లగొట్టడమే కాకుండా నెల రోజులు దాటిన తర్వాత కూడా 300 కేంద్రాల్లో ఇంకా రన్ అవుతూ ఉండటం టాప్ సెన్సేషనని చెప్పొచ్చు. వసూళ్లు దాదాపు ఫైనల్ రన్ కు దగ్గరగా వెళ్తున్నాయి. వీకెండ్స్ మినహాయించి మిగిలిన రోజుల్లో బాగా నెమ్మదించింది. ప్రత్యేకంగా యుఎస్ ప్రమోషన్లను పూర్తి చేసుకున్న హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు సీక్వెల్ స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టాలి. డిమాండ్ దృష్ట్యా బడ్జెట్ చాలా భారీగా ఉండబోతోంది. ఆ మేరకు నిర్మాత పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఒక పెద్ద హీరో హనుమంతుడి వేషంలో కనిపిస్తారని ప్రశాంత్ వర్మ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ప్రస్తుతం ఆప్షన్ల జల్లెడ పడుతున్నారు. మొదటగా వినిపించిన పేరు రానా. ముంబైలో తేజ సజ్జతో కలిసి హనుమాన్ ప్రమోషన్లలో కనిపించింది దీని కోసమేనని ఒక టాక్ ఉంది. తనకన్నా ముందు కెజిఎఫ్ యష్ ని ట్రై చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ నితీష్ తివారి రామాయణంలో రావణుడి వేషం వద్దనుకుంటే అప్పుడు ఈ హనుమాన్ ప్రతిపాదనకు ఎస్ చెప్పొచ్చనే నమ్మకంతో అడగొచ్చని వినికిడి. కన్నడ స్టార్ దర్శన్ ని అనుకున్నారు కానీ అతను ఇతర బాషల సినిమాలు చేయడు.
ఒకవేళ వీళ్ళు కాకపోతే ఇంకెవరు అనే ప్రశ్న పెద్ద సమస్య. చిరంజీవి ప్రస్తావన పలు ఇంటర్వ్యూలలో వచ్చినా ఆయన చేయరని వినిపిస్తున్న మాట. వీరభక్తుడు కాబట్టే తన దేవుడి పాత్ర ఒప్పుకోరని అంటున్నారు. సో ప్రశాంత్ వర్మకి ఇది భారీ టాస్క్. ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉన్న వాళ్ళను తీసుకుంటే రీచ్ ప్లస్ బిజినెస్ రెండూ పెరుగుతాయి. ఈసారి హిందీ మార్కెట్ ఇంకా కీలకం. కానీ మన సక్సెస్ లు చూసి ఈర్ష్య పడుతున్న బాలీవుడ్ బ్యాచ్ లో ఆల్రెడీ హనుమాన్ మీద సినిమాలు మొదలుపెట్టేస్తున్నారు. ఎన్ని తీసినా మన హనుమాన్ తెచ్చుకున్న క్రేజ్ వేరే లెవెల్.
This post was last modified on February 13, 2024 8:57 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…