ప్రభాస్ సినిమాలు అంటే వాటి రేంజే వేరు. అన్నీ భారీ చిత్రాలే. అంతంత పెద్ద రేంజిలో చేస్తూ కూడా ఒకేసారి మల్టిపుల్ మూవీస్ చేయడం ప్రభాస్‌కే చెల్లింది. గత ఏడాది ప్రభాస్ నుంచి వచ్చిన ఆదిపురుష్, సలార్ రెండూ భారీ చిత్రాలే. ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ‘కల్కి’ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘రాజా సాబ్’ను ముందు మామూలు సినిమానే అనుకున్నారు కానీ అది కూడా వీఎఫెక్స్‌తో ముడిపడ్డ పెద్ద రేంజ్ సినిమానే అంటున్నారు. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసి.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ చేయాల్సి ఉంది ప్రభాస్. సందీప్ ఈ మధ్యే ‘యానిమల్’ను రిలీజ్ చేసి ఫ్రీ అయ్యాడు. అతను ‘స్పిరిట్’ స్క్రిప్టు రెడీ చేసుకుని రావడం.. ప్రభాస్ ఆ సినిమా పని మొదలుపెట్టడమే తరువాయి అని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు ప్రణాళికలు మారినట్లు తెలుస్తోంది. సందీప్ రెడీగా లేడా.. లేదా అతడికి వేరే ఆలోచనలున్నాయా.. లేక ప్రభాస్ ఫోకస్ మారిందా తెలియదు కానీ ‘స్పిరిట్’ను కొంచెం హోల్డ్‌లో పెట్టి ‘సలార్-2’ను పూర్తి చేయాలని ప్రభాస్ ఫిక్సయ్యాడట. ‘సలార్-2’కు స్క్రిప్టు దాదాపు సిద్ధంగా ఉండడం, వేగంగా ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయడానికి ప్రశాంత్ పక్కా ప్రణాళికతో ఉండడంతో ప్రభాస్ అటు వైపు చూస్తున్నాడట.
మరోవైపు సందీప్ కూడా ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ చేయాల్సి ఉంది. ఈలోపు అతను అది పూర్తి చేసుకుని వస్తాడేమో చూడాలి. మొత్తానికి ప్రభాస్-సందీప్ కలయిక వచ్చే ఏడాదే ఉంటుందన్నది ఇరువురి సన్నిహిత వర్గాల సమాచారం.
This post was last modified on February 13, 2024 4:46 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…