నిర్మాత దగ్గుబాటి సురేష్‍కి కథ చెప్పి ఒప్పించడం అంత ఈజీ కాదని ఇండస్ట్రీలో చెబుతుంటారు. ఆయనకు ఏ కథ అయినా ఒక పట్టాన నచ్చదట. అందుకేనేమో ఆయన ఈమధ్య రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇతర నిర్మాతలు తీసిన సినిమాలు చూసి, నచ్చితే హక్కులు తీసుకుంటున్నారు.
ఓ బేబీ ఓ కొరియన్ సినిమాకు రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఆయన మిడ్‍నైట్ రన్నర్స్ అనే మరో కొరియన్ సినిమా రీమేక్ హక్కులు కూడా తీసుకున్నారు. అందులోని లీడ్ క్యారెక్టర్లను స్త్రీ పాత్రలుగా మార్చి దర్శకుడు సుధీర్ వర్మ రీమేక్ చేయబోతున్నాడు. రెజీనా, నివేదా థామస్ అందులో హీరోయిన్లుగా నటిస్తారు. సురేష్‍బాబు తాజాగా డాన్సింగ్ క్వీన్ అనే మరో కొరియన్ సినిమా హక్కులు కూడా తీసుకున్నట్టు సమాచారం.
ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగే ఆసక్తికరమైన డ్రామా ఇది. హ్యూమన్ ఎమోషన్స్ అవీ మన తెలుగు నేటివిటీకి దగ్గరగా వుంటాయి. ఓ బేబీ మాదిరిగా మన కుటుంబ ప్రేక్షకులకు నచ్చే మెటీరియల్ కనుక సురేష్ బాబు దీనిని కొన్నట్టున్నారు. దీనికి లక్ష్యం, సాక్ష్యం ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. సురేష్‍బాబు నిర్మాణంలో వెంకటేష్ చేస్తోన్న నారప్ప కూడా రీమేకే కావడం గమనార్హం.
This post was last modified on September 9, 2020 2:02 pm
‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…