Movie News

పొలిటికల్ బయోపిక్కులకు కాలం చెల్లింది

సావిత్రి జీవితకథను మహానటి సినిమాగా మలచి నాగ అశ్విన్ కమర్షియల్ గానూ అద్భుత ఫలితం అందుకున్నాక అందరూ అదే దారి పట్టారు. క్రికెటర్ ధోని జీవితం తెరమీద బాగానే ఆడింది. కానీ రాజకీయ నాయకుల కథలు మాత్రం జనాలు రిసీవ్ చేసుకోని వాస్తవం క్రమంగా అవగతమవుతోంది. ఇటీవలే వచ్చిన ‘యాత్ర 2’కి ఎంత బడ్జెట్ పెట్టినా, అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతో జనాలను థియేటర్లకు తీసుకెళ్లినా అంతగా వర్కౌట్ కావడం లేదు. ఇటీవలే అటల్ బిహారి వాజ్ పాయ్ గారి ‘మై అటల్ హూ’లో పంకజ్ త్రిపాఠి ఎంత గొప్పగా నటించినా లాభం లేకపోయింది.

ఇంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మీద ‘తలైవి’ని కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించి ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశారు. కంగనా రౌనత్ పెర్ఫార్మన్స్ అదిరిపోయినా స్వంత రాష్ట్రంలో జనాలకే పట్టలేదు. బాలకృష్ణ తండ్రికి నివాళిగా చేసిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సైతం చేదు ఫలితాన్నే అందుకుంది. నవాజుద్దీన్ సిద్ధిక్ తో ‘థాకరే’ చేయిస్తే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కిట్టుబాటు కాలేదు. మన్ మోహన్ సింగ్ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ని ఎవరూ పట్టించుకోలేదు. ‘మోడీ’ పాత్రలో వివేక్ ఒబెరాయ్ అదే టైటిల్ తో మూవీ చేస్తే వచ్చిందనే సంగతే ఎవరికీ గుర్తు లేదు.

ఇక్కడ చెప్పిన ఉదాహరణలన్నీ లెజెండరీ పొలిటీషియన్స్ వే. చరిత్రలో గొప్ప స్థానం సంపాదించుకున్న వాళ్ళవే. అయినా బాక్సాఫీస్ వద్ద పరాభవం తప్పలేదు. అర్థం చేసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే బయట రాజకీయ నాయకులను ఎంత ఆరాధించినా వాళ్ళను సినిమాటిక్ స్టైల్ లో చూసేందుకు జనం ఇష్టపడటం లేదు. పైగా వాస్తవాలు దాచి పెట్టి ఎక్కువ శాతం మసిపూసి మారేడుకాయ చేయడమే ఉంటుంది కాబట్టి వీటిని ఆదరణ దక్కడం కష్టమవుతోంది. ఇకనైనా రచయితలు దర్శకులు కొంత కాలం వీటిని ఆపేస్తే బెటరేమో. లేదంటే ఫలితాలు రిపీట్ ఆవుతూనే ఉంటాయి.

This post was last modified on February 11, 2024 12:56 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

9 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

11 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

11 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

13 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

14 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

15 hours ago