Movie News

రామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్ రిస్కీ పాత్ర

ఇప్పుడంటే తెలుగులో కనిపించడం తగ్గించేసింది కానీ రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు ఎంజాయ్ చేసిన డిమాండే వేరు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో మొదలుపెట్టి రవితేజ లాంటి సీనియర్ల వరకు ఎన్నో సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి. ఈ మధ్య ఎక్కువగా వెబ్ సిరీస్ ల మీద ఎక్కువ దృష్టి పెడుతున్న రకుల్ మొన్న సంక్రాంతికి రిలీజైన ఆయలాన్ లో శివ కార్తికేయన్ కు జోడిగా నటించింది. తెలుగులో రాలేదు కానీ తమిళంలో ఓ మోస్తరు కమర్షియల్ ఫలితాన్ని అందుకుంది. తాజాగా ప్యాన్ ఇండియా మూవీలో తనకో రిస్కీ పాత్ర ఆఫర్ వచ్చినట్టు ముంబై టాక్.

భారతీయ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఇతిహాస గాధగా దర్శకుడు నితేష్ తివారి ప్లాన్ చేసుకున్న మూడు భాగాల రామాయణంకు క్యాస్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాముడిగా రన్బీర్ కపూర్ ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. సీతగా సాయిపల్లవి చేసేది లేనిది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హనుమంతుడిగా నటించేందుకు సన్నీ డియోల్ అంగీకారం తెలిపాడు. టాక్సిక్ లో బిజీగా ఉన్న యష్ రావణుడిగా చేసేది లేనిది అధికారిక ప్రకటన వస్తే తప్ప చెప్పలేం. కైకేయిగా లారా దత్త, విభీషణుడిగా విజయ్ సేతుపతిలను తీసుకున్నారు. మరి రకుల్ కి ఇవ్వబోయే క్యారెక్టర్ ఏంటనే పాయింటుకొద్దాం.

రావణాసురుడి చెల్లి శూర్ఫణఖ కోసం రకుల్ ని అడిగినట్టు ఇన్ సైడ్ టాక్. సాధారణంగా చాలా సీరియళ్ళలో ఆవిడను రాక్షసిగా చూపిస్తారు కానీ నిజానికి ఆమె గొప్ప అందగత్తె కాబట్టే లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడనే విధంగా కొన్ని పుస్తకాల్లో ఉంది. ఈ అంశాన్నే నితీష్ తివారి తెలివిగా హ్యాండిల్ చేస్తాడని అంటున్నారు. ఒకవేళ నెగటివ్ గా అనిపించకపోతే రకుల్ ఒప్పుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. నటీనటులకు సంబంధించి అన్ని పేర్లు ఫైనల్ అయ్యాకే ఒక ప్రెస్ మీట్ ద్వారా వాటిని వెల్లడిస్తారట. అప్పటిదాకా ఈ అనధికార వార్తలలో సరిపెట్టుకోక తప్పదు.

This post was last modified on February 10, 2024 2:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago