విపరీతమైన డిమాండ్ లో ఉన్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ తో పని చేయించుకోవడం తెలుగు దర్శకులకు కత్తి మీద సాములా మారిపోతోంది. ఏప్రిల్ 5 లాంటి మంచి డేట్ ని దేవర వదులుకోవడం పట్ల అభిమానులు ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నారు. నెలల క్రితమే లాక్ చేసుకున్న తేదీని ఎందుకు రీచ్ కాలేకపోయారని నిలదీస్తున్నారు. ఊహించని విధంగా సైఫ్ అలీ ఖాన్ ప్రమాదానికి గురి కావడం ఒక కారణమైనా మరీ వారాల తరబడి మంచం మీద ఉండేంత తీవ్రమైంది కాకపోవడంతో అతి త్వరలోనే సెట్స్ లోకి అడుగు పెడతాడనే టాక్ ఉంది. సో ఇబ్బంది లేదు.
ప్రధాన సమస్య అనిరుధ్ తోనే వస్తుందనేది స్పష్టం. దేవరకు ఎన్ని ట్యూన్స్ ఇచ్చాడో ఇప్పటిదాకా బయటికి తెలియకుండా టీమ్ గుంభనంగా ఉంటోంది. షూటింగ్ ప్రారంభమైన కొత్తల్లో దర్శకుడు కొరటాల శివతో డిస్కషన్ లో ఉన్నట్టుగా దిగిన ఫోటోలు తప్ప ఇంకెక్కడా అనిరుద్ కనిపించలేదు. తమిళ సినిమాలతో విపరీతమైన బిజీగా ఉన్నాడనుకున్నా అవసరమైన సమయం మనకూ ఇవ్వాలిగా. ఇంత టైట్ షెడ్యూల్స్ లోనూ గౌతమ్ తిన్ననూరి కోసం చిన్న బడ్జెట్ సినిమా మ్యాజిక్ ఒప్పుకోవడం వెనుక ఆంతర్యం అనిరుద్ కే ట్ తెలియాలి. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.
ఇతను ఎప్పటిలోగా పాటల ఫైనల్ వెర్షన్ ఇస్తాడు, రీ రికార్డింగ్ కి ఎంత సమయం డిమాండ్ చేస్తాడనే దాన్ని బట్టే దేవర కొత్త రిలీజ్ డేట్ ని సెట్ చేసుకోవాలి. అంతే తప్ప తొందరపడి ఏదో ఒకటి ప్రకటించి, మళ్ళీ వాయిదా వేసుకునే పరిస్థితి తెచ్చుకుని ఫ్యాన్స్ తో మాటలు పడకూడదు. టీజర్ కిచ్చిన బీజీఎమ్ కూడా మరీ గొప్పగా లేదు. ఒకవేళ సాంగ్స్ రెడీగా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తో కొరటాల శివ వాటి షూట్ పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. వెయిట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. కనీసం ఒక్క లిరికల్ వీడియో వదిలి ఉన్నా కాస్త భరోసా దక్కేది.
This post was last modified on February 10, 2024 12:53 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…