Movie News

హీరో వెన్నెల కిషోర్ వ‌స్తున్నాడు

టాలీవుడ్ క‌మెడియ‌న్ల‌లో వెన్నెల కిషోర్‌ది ప్ర‌త్యేక‌మైన శైలి. ముందు త‌రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ఓవ‌ర్ ద టాప్ కామెడీ చేయ‌గ‌ల‌డు. అలాగే ఈ త‌రం ప్రేక్ష‌కుల‌ను స‌టిల్ కామెడీతోనూ మెప్పించ‌గ‌ల‌డు. త‌న పాత్ర‌ల్లో ఓ మోస్త‌రు కంటెంట్ ఉన్నా చాలు.. వాటిని త‌నదైన టైమింగ్‌తో మ‌రో స్థాయికి తీసుకెళ్ల‌గ‌ల నైపుణ్యం అత‌డి సొంతం. ఇలాంటి న‌టుడిని ఫుల్ లెంగ్త్‌లో వాడుకోవ‌డానికి ఓ టీం రెడీ అయింది. వెన్నెల కిషోర్ హీరోగా తెర‌కెక్కుతున్న ఆ చిత్ర‌మే. చారి 111. కొన్ని నెల‌ల కింద‌టే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు.

ఒక యానిమేటెడ్ వీడియోతో వెన్నెల కిషోర్ పాత్రకు ఇంట్రో ఇస్తూ సినిమాను అనౌన్స్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కిషోర్‌ది ప్రత్యేకమైన కామెడీ టైమింగ్. అతడికి వెర్రి వెంగళప్ప పాత్రలు ఇస్తే అదరగొడతాడు. టిపికల్ క్యారెక్టర్లను బాగా పోషిస్తాడు. ‘చారి 111’లో తాను కన్ఫ్యూజ్ అయి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ఒక తింగరి ఏజెంట్ పాత్రలో అతను కనిపించబోతున్నాడు. సినిమానుto అనౌన్స్ చేశాక పెద్ద‌గా హ‌డావుడి చేయ‌కుండా సైలెంట్‌గా షూట్ పూర్తి చేసిన చిత్ర బృందం.. అప్పుడే మూవీని రిలీజ్‌కు రెడీ చేసింది. మార్చి 1న చారి 111 విడుద‌ల కాబోతున్న‌ట్లు టీం ప్ర‌క‌టించింది.

అదితి సోని నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీర్తి కుమార్ దర్శకత్వం వహించాడు. మార్చి 1న ఆల్రెడీ వ‌రుణ్ తేజ్ మూవీ ఆప‌రేష‌న్ వాలెంటైన్ షెడ్యూల్ అయి ఉంది. అలాంటి పేరున్న సినిమాకు పోటీగా చారి 111ను దింపుతున్నారంటే సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్న‌ట్లే. మ‌రి వెన్నెల కిషోర్ లీడ్ రోల్‌లో ఏమేర న‌వ్వులు పండిస్తాడో.. ప్రేక్ష‌కుల‌ను ఎంత‌మేర థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తాడో.. ఈ చిత్రానికి ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో చూడాలి.

This post was last modified on February 9, 2024 9:46 am

Share

Recent Posts

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

31 minutes ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

49 minutes ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

57 minutes ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

2 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

3 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

3 hours ago