Movie News

వేస‌వి విందు ముందే..

సినిమాల‌కు సంబంధించి స‌మ్మ‌ర్ సీజ‌న్ సాధార‌ణంగా మార్చి నెలాఖ‌ర్లో మొద‌ల‌వుతుంటుంది. మార్చి మూడో వారానికి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు పూర్త‌వుతాయి. ఆ త‌ర్వాత వేర్వేరు త‌ర‌గ‌తుల విద్యార్థులు ప‌రీక్ష‌లు ముగించుకుని సినిమాల వైపు మ‌ళ్లుతారు. ఏప్రిల్లో బాక్సాఫీస్ పూర్తి స్థాయిలో ఊపందుకుంటుంది. ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య నుంచి మార్చి మూడో వారం వ‌ర‌కు అన్ సీజ‌న్‌గానే భావిస్తారు. ఆ స‌మ‌యంలో కొత్త సినిమాల‌కు వ‌సూళ్లు ఆశించిన స్థాయిలో ఉండ‌వు. అందుకే క్రేజున్న సినిమాల‌ను ఆ టైంలో రిలీజ్ చేయ‌రు.

కానీ క‌రోనా త‌ర్వాత లెక్క‌లు మారి.. ఈ అన్ సీజ‌న్ అనుకునే రోజుల్లోనూ మిడ్ రేంజ్ సినిమాల‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈసారి కూడా అందుకు మిన‌హాయింపేమీ కాదు. ఈ ఏడాది టాలీవుడ్లో వేస‌వి సంద‌డి చాలా ముందుగానే మొద‌లైపోతోంది.

ఫిబ్ర‌వ‌రిలో ఈగ‌ల్, ఊరు పేరు భైర‌వ కోన లాంటి క్రేజున్న సినిమాలు థియేట‌ర్లను క‌ళ‌క‌ళ‌లాడించేలా క‌నిపిస్తున్నాయి. మూడు, నాలుగు వారాల్లో కొంచెం బాక్సాఫీస్ డ‌ల్లుగా మార‌బోతోంది. కానీ మార్చి ఆరంభం నుంచి వేస‌వి విందు మొద‌లైపోనుంది. తొలి వారమే ఆప‌రేష‌న్ వాలెంటైన్ లాంటి పేరున్న సినిమా విడుద‌ల కాబోతోంది. ఇది తెలుగు, హిందీ భాష‌ల్లో పెద్ద స్థాయిలోనే రిలీజ్ కానుంది. త‌ర్వాతి వారం గోపీచంద్ మాస్ మూవీ భీమా రానుంది. దీనికి తోడుగా విశ్వ‌క్సేన్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేసిన గామి విడుద‌ల కానుంది. అత‌డి సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి రావాల్సిన రోజుకే గామిని ఫిక్స్ చేశారు. ఆ వీకెండ్లో సినీ ప్రియుల‌కు మంచి విందు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. మ‌రోవైపు మార్చిలోనే టిట్లు స్క్వేర్ లాంటి క్రేజీ మూవీ విడుద‌ల కాబోతోంది. ఇక ఏప్రిల్, మే నెల‌ల్లో అయితే పెద్ద సినిమాల సంద‌డి వేరే స్థాయిలోనే ఉండ‌బోతోంది.

This post was last modified on February 8, 2024 8:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

1 minute ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago