సుకుమార్ సినిమాలంటే ఒక పట్టాన సెట్స్ మీదికి వెళ్లవు. వెళ్లాక కూడా షూటింగ్ అనుకున్నట్లుగా సాగదు. పోస్ట్ ప్రొడక్షన్లోనూ ఆలస్యం జరగడం అనివార్యం. రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేయడం కూడా సాధారణంగా జరిగే క్రతువే. ‘పుష్ప-2’ విషయంలో ఇవన్నీ జరిగాయి. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. చిత్రీకరణలో ఆలస్యం వల్ల ఈ ఏడాది ఆగస్టు 15కు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
చాలా ముందుగానే ఈ డేట్ ప్రకటించడం.. సుకుమార్ కోరుకున్నంత టైం నిర్మాతలు ఇవ్వడంతో ఈసారి పక్కాగా ఆ డేట్‌కు సినిమా వస్తుందనే అంతా అనుకున్నారు. కొన్ని నెలలుగా ‘పుష్ప-2’ షూటింగ్ కూడా జోరుగానే సాగుతోంది. ఆగస్టు 15న పుష్ప విందుకు అందరూ రెడీ అయిపోయిన టైంలో మళ్లీ వాయిదా వార్తలు ఊపందుకున్నాయి.
షూటింగ్ ఆలస్యం అవుతుండటం.. బహు భాషల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా జాప్యం జరిగే సూచనలుండడంతో ఆగస్టు 15 విడుదల కష్టమే అని వార్తలు వచ్చాయి. పుష్ప-2 స్థానంలోకి దేవర వస్తుందని.. నాని సినిమా సరిపోదా శనివారం కూడా ఆ డేట్ మీద కన్నేసిందని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా ఆ డేట్ మీద కన్నేశాయి. కానీ పుష్ప-2 యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా వాయిదా పడే అవకాశం లేదట. చిత్రీకరణ ఇప్పటిదాకా 65 శాతం దాకా పూర్తి కాగా.. వచ్చే మూడు నెలల్లో మొత్తం పని పూర్తయ్యేలా ప్రణాళికలు వేశారట.
వేర్వేరు యూనిట్లను ఏర్పాటు చేసి సుకుమార్ పర్యవేక్షణలో చిత్రీకరణను వేగవంతం చేసినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో మేకల్లా షూట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. అప్పట్నుంచి సుకుమార్ పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోతారట. జులై నెలాఖరుకల్లా ఫస్ట్ కాపీ తీసేయాలని చూస్తున్నారట.
This post was last modified on February 8, 2024 2:01 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…