గత ఏడాది టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ఒకటిగా నిలిచిన బేబీ త్వరలో హిందీ రీమేక్ కానుంది. పెట్టుబడి రాబడి లెక్కల్లో చూసుకుంటే 2023లో ఇదే పెద్ద హిట్టని ట్రేడ్ పండితులు తేల్చి చెప్పారు. నిర్మాత ఎస్కెఎన్ ఇటీవలే ట్రూ లవర్ ప్రెస్ మీట్ లో రీమేక్ విషయాన్ని మరోసారి నొక్కి చెప్పాడు. ఒరిజినల్ వెర్షన్ తీసిన దర్శకుడు సాయి రాజేషే బాలీవుడ్ వెర్షన్ ని హ్యాండిల్ చేయబోతున్నాడు. అయితే క్యాస్టింగ్ ని ఎంచుకోవడం పెద్ద సమస్యగా మారిందని ఇన్ సైడ్ టాక్. తెలుగులో ఆనంద్ దేవరకొండ తప్పించి కొత్త మొహాలతో వెళ్లిపోవడంతో హ్యాపీగా టెన్షన్ లేకుండా చేసుకున్నారు. కానీ అక్కడలా కాదు.
స్టార్ కిడ్స్ ఎవరినైనా తీసుకునే ఆలోచనలో బేబీ టీమ్ ఉందట. వైష్ణవి చైతన్య పోషించిన టైటిల్ రోల్ కోసం దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ ని సంప్రదించే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ అమ్మాయి ఇటీవలే వచ్చిన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఆర్చీస్ లో ఏమంత చెప్పుకునే స్థాయిలో రాణించలేదు. పైగా లుక్స్ కూడా గొప్పగా లేవు. అలాంటప్పుడు పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే బేబీకి తీసుకుంటే ఖచ్చితంగా రిస్క్ అవుతుంది. పోనీ షారుఖ్ కూతురు సుహానా ఖాన్ చూద్దామా అంటే తన మీదే ఎక్కువ నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. సో కొత్త ఆర్టిస్టులైతేనే సుఖంగా ఉండొచ్చు.
ఇక ఇద్దరు హీరోల ఎంపిక కూడా సవాల్ గానే నిలుస్తోంది. నోటెడ్ ఆర్టిస్టులను తీసుకోవడం ఒక ఆప్షన్ అయితే విరాజ్ అశ్విన్, ఆనంద్ దేవరకొండ లాగా ఫ్రెష్ కుర్రాళ్లను తీసుకోవడం ఇంకో ఆప్షన్. ఇది తేల్చుకోవడంలో జరుగుతున్న ఆలస్యం వల్లే ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేకపోతున్నారట. బేబీ లాంటి సబ్జెక్టుకు నార్త్ మార్కెట్ లో ఇంకా బాగా వర్కౌట్ అవుతాయి. దానికి అనుగుణంగానే స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్టు తెలిసింది. కొంత ఆలస్యమయ్యేలా ఉంది. ఇక్కడ వంద కోట్లు సాధించినప్పుడు ఇదే టాక్ వస్తే బాలీవుడ్ మార్కెట్ లో డబుల్ సెంచరీ ఖాయం.
This post was last modified on February 7, 2024 3:58 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…