సంక్రాంతి పండక్కి రావాల్సిన సినిమా.. ఈగల్. కానీ అప్పుడు పోటీ మరీ ఎక్కువైపోవడం, థియేటర్ల సర్దుబాటు సమస్యగా మారడంతో పెద్ద మనసు చేసుకుని పోటీ నుంచి తమ చిత్రాన్ని తప్పించారు ఈగల్ మేకర్స్. అందుకు ప్రతిఫలంగా కొంచెం స్థాయి ఉన్న సినిమాలేవీ రిలీజ్ కాకుండా చూసింది నిర్మాతల మండలి. పెద్దగా పోటీ లేకుండా రిలీజ్ కావడం ‘ఈగల్’కు మంచిదే కానీ.. ఇది అన్ సీజన్ కావడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది.
సంక్రాంతి టైంలో ఎక్కువ సినిమాలు రిలీజైనా జనం ఎగబడతారు. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతాయి. టాక్ కొంచెం బాగుంటే ఈజీగా పాసైపోతుంది సినిమా. ‘నా సామి రంగ’ లాంటి యావరేజ్ మూవీ పండక్కి ఎలా ఆడేసిందో తెలిసిందే. సంక్రాంతికి ఎగబడి సినిమాలు చూశాక జనం.. తర్వాత కొన్ని వారాల వరకు కొత్త సినిమాల వైపు చూడటం కష్టమే.
అందుకే తర్ాతి రెండు వారాల్లో తెలుగు నుంచి సినిమాలే రిలీజ్ కాలేదు. గత వారం వచ్చిన అనేక చిన్న సినిమాలను జనం పట్టించుకోలేదు. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ పర్వాలేదనిపించింది. ఇక ఈ వారం బాక్సాఫీస్ విషయానికి వస్తే.. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా డల్లుగానే కనిపిస్తోంది. ‘ఈగల్’ సినిమాకు కూడా దాని స్థాయిలో బుకింగ్స్ జరగట్లేదు. ఫాస్ట్ ఫిల్లింగ్ షోలు తక్కువగా కనిపిస్తున్నాయి. 90 శాతం షోలు గ్రీన్ కలర్లోనే కనిపిస్తున్నాయి.
ఇక ఈ వారం పోటీలో ఉన్న మిగతా చిత్రాల మీద కనీస ఆసక్తి కూడా కనిపించడం లేదు. యాత్ర-2, లాల్ సలాం, ట్రూ లవర్ సినిమాలకు మరీ నామమాత్రంగా కనిపిస్తున్నాయి బుకింగ్స్. రవితేజ సినిమా అంటే మామూలుగా బుకింగ్స్ ఈపాటికి ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉండాలి. కానీ ‘ఈగల్’ విషయంలో అలా జరగట్లేదు. ఐతే కంటెంట్ మీద టీం చాలా నమ్మకంతో ఉంది. కాబట్టి టాక్ బాగుంటే ఆటోమేటిగ్గా కలెక్షన్లు పుంజుకుంటాయని ఆశిస్తున్నారు.
This post was last modified on February 7, 2024 3:56 pm
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…
తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…
సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…