Movie News

నిశ్శబ్దంగా పని చేసుకుంటున్న ఈగల్

మాస్ మహారాజా కొత్త సినిమా అంటేనే అదో సెలబ్రేషన్ లా ఉంటుంది అభిమానులకు. కానీ ఈగల్ విషయంలో ఆ స్థాయి బజ్ కనిపించడం లేదని కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా కంటెంట్ మీద నమ్మకంతో దర్శక నిర్మాతలు ఓవర్ పబ్లిసిటీ చేయకపోవడం వల్లే లో ప్రొఫైల్ కొనసాగుతోంది. హీరో రవితేజ, నిర్మాత టిజి విశ్వప్రసాద్, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఇస్తున్న ఇంటర్వ్యూలలో చాలా కూల్ గా ఇందులో ఉన్న అంశాలను ప్రస్తావిస్తున్నారు కానీ ఓవర్ గా ఎలివేట్ చేసి చెప్పడం కానీ, లేనిపోని బిల్డప్ లు ఇవ్వడం కానీ ఏ కోశానా చేయడం లేదు.

అడ్వాన్స్ బుకింగ్స్ మరీ భీకరంగా లేకపోయినా ఉదయం ఆట అయ్యాక ఒక్కసారిగా టాక్ వచ్చే మార్పు అనూహ్యంగా ఉంటుందని టీమ్ నమ్ముతోంది. టీజర్, ట్రైలర్ లో ట్విస్టులు రివీల్ కాకూడదనే ఉద్దేశంతో జాగ్రత్తగా కట్ చేయడం వల్ల ఇదేదో యాక్షన్ మూవీ అనుకున్న ప్రేక్షకులు చాలానే ఉన్నారు. కానీ ప్రాపర్ కమర్షియల్ ఫార్మాట్ లో పత్తి రైతుల సమస్య బ్యాక్ డ్రాప్ లో ఎవరూ ఊహించని ట్రీట్ మెంట్ ని ఈగల్ రూపించారట. ముఖ్యంగా చివరి ముప్పావు గంట ఊహించని ఎలివేషన్లతో కట్టి పారేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. హీరో, ప్రొడ్యూసర్ ఇద్దరూ అదే మాట అంటున్నారు.

ఇది సక్సెస్ కావడం రవితేజకు చాలా కీలకం. ధమాకా సోలో బ్లాక్ బస్టర్ తర్వాత రెండు ఫ్లాపులు వచ్చాయి. రావణాసుర కాన్సెప్ట్ ఫెయిల్ కాగా, టైగర్ నాగేశ్వరరావుకు ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. అందుకే ఈగల్ ఆ గాయాలను తుడిచేస్తుందనే నమ్మకం యూనిట్ లో కనిపిస్తోంది. అయితే ఇంగ్లీష్ టైటిల్ మాస్ కి తొందరగా రీచ్ కావడం లేదు. కంటెంట్ బాగుంటే ఇదేమీ పెద్ద సమస్య కాదు. స్టైల్, యాక్షన్, కమర్షియాలిటీ ఈ మూడింటిని కార్తీక్ ఎలా బ్యాలన్స్ చేశాడనే దాని మీద మెప్పించడం ఆధారపడి ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు.

This post was last modified on February 7, 2024 4:05 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

39 minutes ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

3 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

3 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

3 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

4 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

4 hours ago