ఇది ఓటీటీల కాలం. ఇంతకుముందు తమ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని నొక్కి వక్కాణించిన వాళ్లు సైతం తర్వాత మనసు మార్చుకున్నారు.
హిందీలో లక్ష్మీబాంబ్ సినిమా విషయంలో ఇలాగే పట్టుబట్టి ఉన్న నిర్మాతలు తర్వాత దాన్ని హాట్ స్టార్ వాళ్లకు ఇచ్చేశారు.
తెలుగులో వి సినిమా పరిస్థితి కూడా ఇంతే. థియేటర్లలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామన్న దిల్ రాజు.. చివరికి అమేజాన్ ప్రైమ్ వాళ్లకు అమ్మేశాడు. ఈ నేపథ్యంలో ఓటీటీలో రిలీజవుతాయంటూ పలు సినిమాల గురించి వార్తలొస్తున్నాయి.
చివరికి వకీల్ సాబ్ గురించి కూడా ఈ రకమైన వార్తలొచ్చాయి. ఈ దిశగా సంప్రదింపులు కూడా జరిగాయన్నారు. కానీ దిల్ రాజు ససేమిరా అనేసినట్లు చెబుతున్నారు. అయినా పవన్ కళ్యాణ్ సినిమాను ఓటీటీలో ఎలా రిలీజ్ చేస్తారసలు.
పవన్ సినిమా ఏంటి.. ఆయన అభిమాని అయిన నితిన్ కొత్త సినిమాను సైతం ఓటీటీలో రిలీజ్ చేయడానికి అవకాశమే లేదు అంటున్నారు దాని నిర్మాతలు. ఈ ఏడాది ఆరంభంలో భీష్మతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన నితిన్.. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దె సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ ఇందులో కథానాయిక. గత నెలలో నితిన్ పెళ్లి సందర్భంగా దీని టీజర్ కూడా రిలీజ్ చేశారు. అది ఆసక్తి రేకెత్తించింది.
ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు అప్పుడే చిత్ర బృందం ప్రకటించింది. కానీ రెండు రోజులుగా ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ల వరకు వెళ్లింది.
అలాంటి ఉద్దేశమే లేదని పీఆర్వోలకు సమాచారం ఇచ్చారు. సంక్రాంతికే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానున్నట్లు సమాచారం. కొన్ని రోజుల్లోనే సినిమా టాకీ పార్ట్ పూర్తయిపోతుందట.
This post was last modified on September 8, 2020 11:15 am
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…