ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా వెండితెర వెబ్ సిరీస్ అయ్యేలా ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది కేవలం రెండు భాగాలతో ఆగేలా లేదట. ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న సెకండ్ పార్ట్ తర్వాత చివరి ఘట్టాన్ని ది రోర్ పేరుతో కంప్లీట్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాధమికంగా బన్నీ, సుక్కు, మైత్రి అధినేతలు ఓకే అనుకున్నారట. ఎలాగైనా ఆగస్ట్ 15 విడుదల తేదీని మిస్ కాకూడదనే కృత నిశ్చయంతో నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుతూనే ఉన్నారు.
సుకుమార్ గతంలోనే దీన్నో వెబ్ సిరీస్ కు సరిపడా లెన్త్ తో రాసుకున్నానని, కానీ బన్నీకి నచ్చాక సినిమా నిడివికి తగ్గట్టు మార్చానని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఫ్రెష్ గా అవుట్ ఫుట్ చూసుకున్నాక దీన్ని మరింత విస్తరించాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. మూడేళ్లుగా బన్నీ దీని కోసమే పొడవాటి జుత్తుని కష్టపడి మైంటైన్ చేస్తున్నాడు. భవిష్యత్తులో పుష్ప 3 చేయాలన్నా మళ్ళీ ఇంత స్థాయిలో పెంచడం చాలా కష్టం. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ వంగా, అట్లీలతో ప్రోజెక్టులకు అనుగుణంగా మేకోవర్ కావాల్సి ఉంటుంది. సో ఏది చేసినా ఇప్పుడే చేయాలి.
అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఇస్తారో వేచి చూడాలి. జపాన్ ఎపిసోడ్, జాతరలో బన్నీ చీర కట్టుకుని చేసే ఫైట్, థియేటర్ యాక్షన్ బ్లాక్ ఇవన్నీ ది రూల్ లో ఓ రేంజ్ లో పేలతాయట. ఫహద్ ఫాసిల్ అల్లు అర్జున్ మధ్య క్లాష్ ని మూడో భాగంలోనే ఎక్కువగా చూసే అవకాశం ఉండొచ్చని తెలిసింది. ఇప్పటిదాకా పరిచయం కాని ఎన్నో కొత్త పాత్రలు ఎంట్రీ ఇస్తాయని కూడా అంటున్నారు. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ తరహాలో పుష్పని టాలీవుడ్ తరఫున ఒక పవర్ ఫుల్ బ్రాండ్ గా మార్చేందుకు సుకుమార్ మాములు కష్టం పడటం లేదు. దీన్ని టీమ్ ప్రకటించే దాకా సస్పెన్స్ తప్పదు.
This post was last modified on February 7, 2024 8:14 am
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…