Movie News

బిగ్ బాస్ కంటెస్టెంట్ల కులాల కోసం వెతుకులాట‌

నాలుగేళ్ల కింద‌ట పి.వి.సింధు రియో ఒలింపిక్స్‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఆద‌ర‌ణ సంపాదించుకుంది. ఆ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా క్రీడాభిమానులు సింధు గురించి విశేషాలు తెలుసుకోవ‌డానికి ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించారు.

అయితే మిగ‌తా వాళ్లంద‌రూ ఆమె ఎలా ఈ స్థాయికి వ‌చ్చింది.. కెరీర్ విశేషాలేంటి.. కుటుంబం, ఇత‌ర వ్య‌క్తిగ‌త సంగ‌తులేంటి అని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తే.. మ‌న తెలుగు జ‌నాలు మాత్రం ఇంట‌ర్నెట్లో ఆమె కులం కోసం సెర్చ్ చేయ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్‌గా మారింది.

గూగుల్లో సింధు అని పేరు కొట్ట‌గానే ప‌క్క‌న క్యాస్ట్ అనే ప‌దం డీఫాల్ట్‌గా రావ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. ఈ విష‌య‌మై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అయినా స‌రే.. మ‌నోళ్ల‌లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌లేదు.

సోష‌ల్ మీడియా జోరు పెరిగాక ఈ కుల సంబంధిత చ‌ర్చ‌లు, వాదోప‌వాదాలు మ‌రీ ఎక్కువైపోయాయి. తాజాగా బిగ్ బాస్ షో మొద‌లైన నేప‌థ్యంలో అందులో పార్టిసిపెంట్ల కులాల గురించి ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తుండ‌టం గ‌మ‌నార్హం.

యాంక‌ర్ లాస్య హౌస్‌లోకి అడుగు పెట్ట‌గానే ఆమె రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందింద‌ని.. ఆమెకు స‌పోర్ట్ చేద్దామ‌ని ఒక వ‌ర్గం వాళ్లు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. మ‌రోవైపు గంగ‌వ్వ మున్నూరు కాపు అని.. ఆమెను గెలిపించుకుందామ‌ని ఇంకో వ‌ర్గం ప్ర‌చారం మొద‌లుపెట్టింది.

మిగ‌తా పార్టిసిపెంట్ల‌లో కొంద‌రి కులాలు కూడా వెలికితీసే ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఇది చూసి తెలుగు రాష్ట్రాల జ‌నాల్లో కుల పిచ్చి ఈ స్థాయికి చేరిందేంటంటూ విజ్ఞులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌న‌వాళ్లు మార‌ర‌ని, ఈ జాఢ్యం ఎప్ప‌టికి వ‌దులుతుందో అని నిట్టూరుస్తున్నారు.

This post was last modified on September 8, 2020 10:55 am

Share
Show comments
Published by
satya

Recent Posts

సలార్ అక్కడెందుకు ఫ్లాప్ అయ్యింది

స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…

1 hour ago

సమీక్ష – ఆ ఒక్కటి అడక్కు

గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…

2 hours ago

మీనమేషాలు లెక్కబెడుతున్న భారతీయుడు 2

లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…

2 hours ago

వివేకా కేసులో సంచ‌ల‌నం.. అవినాష్‌కు ఊర‌ట‌

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డికేసులో తాజాగా సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…

3 hours ago

రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ !

లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…

3 hours ago

ముద్రగ‌డ ఫ్యామిలీలో క‌ల్లోలం.. ప‌వ‌న్‌కు జైకొట్టిన కుమార్తె

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించ‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్తితే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న…

4 hours ago