గేమ్ ఛేంజర్ మహా అయితే ఇంకో రెండు నెలల్లో పూర్తవుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ 16కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం సపోర్టింగ్ క్యాస్ట్ ని ఎంచుకునే పనిలో, కొత్తవాళ్ల ఆడిషన్లలో టీమ్ బిజీగా ఉంది. అయితే హీరోయిన్ విషయం మాత్రం ఇంకా కొలిక్కి రావడం లేదు. ముందు అలియా భట్ ని అడిగారనే టాక్ వచ్చింది. కానీ తనకున్న కమిట్ మెంట్లలో మూడు భర్త రన్బీర్ కపూర్ తో చేయాల్సినవి ఉన్నాయి. సో హైదరాబాద్ వచ్చి తెలుగు సినిమాలో నటించే పరిస్థితిలో లేదు. తాజాగా సమంతా పేరు ప్రచారంలోకి తెచ్చారు అది కూడా ఉత్తుత్తి గాసిప్పే తప్ప నిజం కాదు.
ప్రధానమైన సమస్య మరొకటుంది. ఈ మూవీ మొత్తం ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో పక్కా పల్లెటూరి నేపథ్యంలో జరుగుతుంది. చరణ్ కి స్లాంగ్ నేర్పించడానికి ప్రత్యేకంగా శిక్షణ సిద్ధం చేశారు. నేటివిటీ బలంగా ఉండటం కోసం ఆర్టిస్టులను అక్కడి వాళ్లనే తీసుకునేలా ప్లానింగ్ అయిపోయింది. అలాంటప్పుడు పూర్తి గ్లామర్ హీరోయిన్ సెట్ కాదు. పెర్ఫార్మన్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది. అందుకే బుచ్చిబాబు రాజీ పడకుండా రకరకాల ఆప్షన్ లు చూస్తున్నాడట. ఒక దశలో రవీనాటాండన్ కూతురికి ఫోటో షూట్స్, టెస్ట్ షాట్స్ చేశారు కానీ అవేమంత సంతృప్తిగా రాలేదని సమాచారం.
ఈ లెక్కన సాయిపల్లవి రేంజ్ ఆర్టిస్టు అయితే తప్ప బుచ్చిబాబు అన్వేషణ ఫలించదు. తను అందుబాటులో లేదు. డేట్లు సర్దుబాటు కష్టమే. బాలీవుడ్ రామాయణంతో పాటు అమీర్ ఖాన్ కొడుకు సినిమాలు ఎక్కువ డేట్లు డిమాండ్ చేస్తున్నాయి. నాగ చైతన్య తండేల్ కు పరిమిత కాల్ షీట్లు అడగటంతో ఎస్ చెప్పిందట. మరి ఫైనల్ గా చరణ్ బుచ్చిబాబులు ఎవరిని ఎంచుకుంటారనేది సస్పెన్స్ గానే ఉంది. రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోయే ముందు పూర్తి వివరాలతో ఒక ప్రెస్ మీట్ నిర్వహించే ఆలోచనలో టీమ్ ఉంది. కబడ్డీ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని వినికిడి.
This post was last modified on February 6, 2024 9:24 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…